ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దేశంలో ఏ రాష్ట్రంలో జరగట్లేవని చెప్పాలి.. ఏ రాష్త్రంలోనూ ముఖ్యమంత్రి ని ఇంతలా ఏ ప్రతిపక్షాలు టార్గెట్ చేయలేదు.. ప్రతి విషయంలో అధికార ప్రభుత్వాన్ని నిందిస్తూ, కోర్టు లో కేసులు వేసి గెలుస్తూ , అసలు ప్రభుత్వంలో ఉన్నది టీడీపీ నా, వైసీపీ నా అన్నది తెలీకుండా టీడీపీ ప్రవర్తిస్తుంది.. ఓ వైపు నేతలు జైలుకు వెళుతున్నా ఏమాత్రం తగ్గకుండా వైసీపీ ని విమర్శలపాలు చేస్తూ గుదిబండలా తయారైంది.. ఇక అమరావతి భూముల విషయం లో అయితే జగన్ ఎంత బ్యాడ్ చేయాలో అంత చేసేసింది టీడీపీ.

రాష్ట్రాభివృద్ధి లో భాగంగా జగన్ మూడు రాజధానులను సృష్టించి అమరావతి ప్రజలకు ద్రోహం చేశాడని టీడీపీ వర్గాలు అమరావతి లో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వైసీపీ ఇప్పుడు అవన్నీ ఒట్టి అపోహలు, టీడీపీ తమ రాజకీయ ఉనికిని చాటడానికి ఇలా అబద్ధపు ప్రచారకం చేస్తున్నారు అని చెప్తూ అమరావతి ప్రజలను అక్కున చేర్చుకునేది తమ ప్రభుత్వం అని చెప్తున్నారు.. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం అక్కడి ప్రజలకు తమ తరపున భరోసా ఇచ్చేనందుకు సిద్ధమయినట్లు తెలుస్తుంది.. వాస్తవానికి అమరావతి లో పోరాటం చేసేది రైతులు కాదు టీడీపీ నుంచి లాభం పొందిన కొందరు భూబకాసురులు అని వైసీపీ వారు భావిస్తున్నారు..

ఇక టీడీపీ ని దెబ్బకొట్టే విధంగా జగన్ కొన్ని అస్త్రాలు సిద్ధం చేస్తున్నారు.. పార్టీలు మారి వచ్చిన నేతలకు వైసీపీలో ప్రాధాన్యత ఇస్తూ వచ్చే ఆశావహులు పోర్త్సహిస్తున్న తీరు జగన్ లో కనిపిస్తుంది. తనను నమ్మి వచ్చిన వారికి ఖచ్చితంగా వారికిచ్చిన హామీలను అమలుచేస్తానని జగన్ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తుండటం చర్చనీయాంశమైంది.గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నుంచి వచ్చిన వల్లభనేని వంశీ, వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుకు మధ్య పొసగడం లేదు. రెండు వర్గాలు గన్నవరంలో బాహాబాహీ అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. చీరాల నియోజకవర్గంలోనూ అంతే. ఇక్కడ వైసీపీ ఇన్ ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ను కాదని పార్టీలోకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం కు ప్రాధాన్యత ఎక్కువ దక్కుతుంది. ఇవన్నీ చూస్తుంటే జగన్ వారికి ప్రాధాన్యం ఇవ్వడంలో టీడీపీ ని నాశనం చేసే ప్లాన్ ఉందని యిట్టె తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: