తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఎదుర్కోవడానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఎప్పటికప్పుడు సరికొత్త ఎత్తులను వేస్తూనే ఉంది. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి అంటే విమర్శలు చేసే విషయంలో చాలా దూకుడుగా వెళ్లాల్సి ఉంది. అయితే రాష్ట్ర పార్టీ నేతలు విమర్శలు చేసే విషయంలో వెనకడుగు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం కాస్త జాగ్రత్తగా వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

త్వరలోనే రాష్ట్రానికి హోంమంత్రి అమిత్ షా తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. త్వరలోనే రాష్ట్రంలో పర్యటించే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఒక సభ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర పార్టీ నేతలకు ఒక సమాచారం కూడా బీజేపీ అధిష్టానం నుంచి వచ్చినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. ఇక హైదరాబాద్ లో అమిత్ షా సమావేశం నిర్వహించి అవకాశం ఉందని తెలుస్తోంది.

దీనికి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా వచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం కోసం దీనిని వాడుకునే విధంగా కూడా బీజేపీ అధిష్టానం కాస్త రెడీ అవుతుంది. మరి ఇవి ఎంతవరకు ఫలిస్తాయి ఏంటి అనేది మాత్రం అనేది చూడాలి. ఇక హైదరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడం మాత్రం బీజేపీకి చాలావరకు కష్టంగానే ఉంటుంది. మరి ఎలాంటి ముందడుగు పడుతుంది ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు ఉన్న పరిణామాలు మాత్రం కాస్త హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అధికార టీఆర్ఎస్ పార్టీని కాస్త ఎక్కువగానే టార్గెట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: