ప్రధాని నరేంద్ర మోడీ త్వరలోనే భారత్ చైనా సరిహద్దు లోకి వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది తెలియదు గాని దీనిపై మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. చైనాను టార్గెట్ గా చేసే ఆయన లడఖ్   లో సైనికులను ఉద్దేశించి మరోసారి మాట్లాడే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. అయితే లడఖ్ లో మంచు వాతావరణం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి అక్కడికి వెళ్తారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు.

దీనికి సంబంధించి ఒక క్లారిటీ త్వరలోనే వస్తుంది. బీహార్ ఎన్నికలు జరిగే సమయానికి ఆయన సరిహద్దుల్లో కి వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. దీనిద్వారా బీహార్ ప్రజల్లో కూడా ఒక రకమైన మద్దతు కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందని కొంతమంది విపక్షాల నేతలు ఆరోపణలు కూడా చేస్తున్నారు. అయితే రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ తో కలిసి ఆయన సరిహద్దు లోకి వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక తేదీని కూడా ప్రకటించే అవకాశాలు ఉండవచ్చు.

 అయితే కొన్ని కారణాల వలన తేదీ ప్రకటించకుండానే ప్రధానమంత్రి నరేంద్రమోడీ సడన్ గా వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు. ఇటీవల ఆయన వెళ్లిన సందర్భంగా మీడియాకు ఎలాంటి సమాచారం కూడా లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని జాతీయ మీడియా ఛానల్స్ కు మాత్రమే ఆయన పర్యటన గురించి వివరాలు అందించారు. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడు వెళ్తారు ఏంటి అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. అయితే సరిహద్దుల్లో మాత్రం  ఇప్పుడు సైనికులు భారీగా మోహరించారు. చైనా వైపు నుంచి కూడా భారీగా మోహరించిన సంగతి తెలిసిందే. మరి భారత్ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: