జ్యోతిరాదిత్య సింధియా.. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఓ ప్రముఖ నేతన్న సంగతి అందరికీ తెలిసినదే. అక్కడ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న సింధియా తాజాగా ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన సంగతి కూడా మనకు తెలిసిందే. కాగా.. తాజాగా ఆయన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని వదిలేసినందుకు తనకు ఎలాంటి బాధ లేదని, పైగా చాలా సంతోషంగా వున్నానని చెప్పుకొచ్చారు.

బీజేపీ తనకు చాలా అనుకూలంగా ఉందని, వ్యక్తిగత సామర్థ్యాలను బట్టి బీజేపీలో పదవులు లభిస్తాయని ఈ సందర్భంగా చెప్పారు. మోదీ, అమిత్ షా, నడ్డా వంటి నాయకులతో కలిసి ప్రజలకు సేవ చేయడం తనకు దక్కిన అత్యంత అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా ఈయన అనేక విషయాలు ప్రస్తావించారు. తాను రాజకీయాల్లో వున్నది కేవలం ప్రజలకు సేవ చేయడానికే అని అన్నారు.

తాను 8 ఏళ్ళ పాటు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఏనాడు కూడా పదవి వ్యామోహంతో పని చేయలేదని అన్నారు. ఈ క్రమంలో గత 20 ఏళ్లుగా తనను చాలా మంది చూస్తున్నారని వారికి తన గురించి బాగా తెలుసునని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడంలోనే తనకు నిజమైన ఆత్మ సంతృప్తి ఉందన్నారు. రాజకీయాలను కేవలం సేవ చేసేందుకు లభించిన అవకాశంగానే చూస్తానని, ఈ క్రమంలో వేరేవిధమైన ప్రలోభాలకు ఎంతమాత్రం లొంగనని చెప్పారు.

అలాగే, ఈ సందర్భంగా తన తండ్రి గురించి మాట్లాడుతూ... తన తండ్రి మంచి రాజనీతజ్ఞుడని, అతని మాదిరే తనకు కూడా ప్రజాసేవ పైనే పూర్తి ఆసక్తి అని తేల్చి చెప్పారు. మోడీ నీడలో భారత దేశం చాలా సుభిక్షంగా ఉందని అన్నారు. కరోనా లాంటి విపత్తు తరువాత కూడా దేశాన్ని నిలబెట్టడం మోడీకే చెల్లిందని అన్నారు. ఇది మరే రాజకీయ నాయకుడికి సాధ్యపడదని బల్ల గుద్ది మరీ చెప్పారు. ఇక రాబోయే దశాబ్ద కాలం కూడా బీజేపీదే అని ఈ సందర్భంగా సింథియా జోస్యం చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: