ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు రాజధాని అంశం కాస్తా హాట్ టాపిక్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అసలే రాజధాని అంశానికి సంబంధించి ఎప్పుడు ఏం జరుగుతుంది అనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దసరా తర్వాత రాజధానికి సంబంధించి శంకుస్థాపన ఉండే అవకాశాలు ఉన్నాయని అందరూ భావించారు. అయితే దీనికి ఇప్పటి వరకు కూడా ముందు పడలేదు. జగన్ కూడా రాజధాని విషయంలో కాస్త సీరియస్ గానే ఉన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా మాకు సంబంధం లేదు అని చెప్పినా సరే కొంతమంది విపక్షాల నేతలు మాత్రం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా మారింది.

రాజకీయంగా ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే సీఎం జగన్ ని ఎదుర్కోవడానికి విపక్షాలకు ఉన్న ఒకే ఒక అస్త్రం అమరావతి. దీంతో అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుగుదేశం పార్టీ చేయిస్తుంది అనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి కొన్ని పక్షాలు కూడా సహాయ సహకారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు  అమరావతి విషయంలో సీఎం జగన్ కొన్ని నిధులను కూడా ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి త్వరలోనే అమరావతి క్యాపిటల్ రీజియన్ కు భారీగా నిధులను ప్రకటించే అవకాశాలు ఉండవచ్చు అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

దసరా తర్వాత బడ్జెట్ లో లేకుండానే ఈ ప్రాంతానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్ సమావేశం అయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఇక ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసి సీఎం జగన్ కు అందించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. అమరావతిని అభివృద్ధి లో ఎక్కడ కూడా తక్కువగా చూసే అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: