కేంద్రం తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి సుదీర్ఘ కాలంలో పెండింగ్ లో ఉన్న 202.3 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది.  ఇందుకు గానూ... కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. ఈ ప్రతిపాదనల గురించి పలు దఫాలుగా కిషన్ రెడ్డి కేంద్ర రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. శుక్రవారం (అక్టోబర్ 23, 2020న) గడ్కరీ గారితో కిషన్ రెడ్డి సమావేశమయిన అనంతరం ఈ విడుదలకు గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

వరదలు, భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు బాగా దెబ్బతిన్న సమయంలో ఈ నిధులు వస్తుండటం శుభపరిణామం అని ఆయన అన్నారు. ఈ మొత్తాన్ని తెలంగాణ రోడ్డు భవనాల శాఖ (ఎన్‌హెచ్).. రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ పనుల కోసం ఉపయోగించుకునే వీలు కలుగుతుందని గడ్కారి చెప్పారు. కిషన్ రెడ్డి సమయానుకూలంగా చొరవతీసుకుని సమన్వయం చేయడం వల్ల నిధులు త్వరగా విడుదలయ్యాయని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 8 జాతీయ రహదారుల (పొడవు 868 కి.మీ.) నిర్వహణ, మరమ్మత్తుల కోసం ₹ 202.00 కోట్ల  అంచనాలను ఎన్ హెచ్ ఏ ఐ ఆమోదించింది అన్నారు.

కేంద్ర సర్కార్ విడుదల చేసిన మొత్తం నిధులు తెలంగాణ రాష్ట్ర ఆర్‌అండ్‌బి (ఎన్‌హెచ్) సమర్పించిన ప్రతిపాదనలకంటే 85% ఎక్కువగా ఉన్నాయి. వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు మరింత పాడవకుండా, కొత్త గుంతలు ఏర్పడకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సురక్షితంగా వాహనాలు నడిపేందుకు వీలుగా రోడ్లను బాగుచేసేందుకు ఈ నిధులను సద్వినియోగాం చేసుకునే అవకాశం ఉంటుంది. వరదలు, అకాల వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని పూరిస్తూ తెలంగాణ రాష్ట్ర సర్కారు చేపట్టే మరమ్మత్తు, పునరావాస కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని కిషన్ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: