ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఎంపీ బయటకు వెళ్లే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎవరు వెళ్తారు ఏంటి అనే దానిపై స్పష్టత లేకపోయినా మీడియా వర్గాలలో మాత్రం దీనికి సంబంధించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల రామ్మోహన్ నాయుడు పార్టీ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందని ఆయన బిజెపిలో చేరే అవకాశాలు ఉన్నాయని కొంతమంది వ్యాఖ్యానించారు. అది నిజం కాదని తెలిసింది. ఇక ఇప్పుడు కేశినేని నానీ కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం ఎక్కువగా జరుగుతుంది.

నానీ  కూడా బిజెపి నేతలతో ఎక్కువగా సావాసం చేయడం ఆయన ఢిల్లీలో ఎక్కువగా ఉండటంతో నాని పార్టీ మారతారని అందరూ భావించారు. అయితే దానికి సంబంధించి కూడా ఇంకా ఎలాంటి ముందడుగు పడలేదు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలోనే ఒక సంచలనం చోటుచేసుకునే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి గల్లా జయదేవ్ కచ్చితంగా పార్టీ మారవచ్చు అని అందరూ భావిస్తున్నారు.

దీనితో చంద్రబాబు నాయుడు ఇప్పుడు రంగంలోకి దిగినట్లు సమాచారం. త్వరలోనే ఆయనకు కొన్ని ఆఫర్లు కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటు కాకుండా ఎమ్మెల్యే సీటు ఇచ్చి పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. గల్లా జయదేవ్ కు సంబంధించి ముందు కొన్ని వార్తలు వచ్చినా ఆ తర్వాత మాత్రం ఆయన సైలెంట్ కావడం అదే విధంగా అమరావతి ఉద్యమంలో కూడా కాస్త క్రియాశీలకంగా పాల్గొనడంతో అందరూ కూడా ఆసక్తిగా చూశారు. మరి ఇప్పుడు ఆయన పార్టీలో ఉంటారా బయటకు వెళ్తారా అనే దానిపై త్వరలోనే ఒక స్పష్టత రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: