కొద్ది నెలల క్రితం ఏపీ లో జరగవలసిన లోకల్ బాడీ ఎలక్షన్స్ కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. తరువాత జరిగిన పరిణామాలను కూడా చూసాము. అయితే ఎన్నో నాటకీయ సన్నివేశాల తరువాత తిరిగి ఏపీ ఎలక్షన్ కమిషనరుగా నిమ్మగడ్డ రమేష్ నే నియమించాలని హై కోర్ట్ తీర్పు ఇచ్చింది. కాగా ఒక రాష్ట్రంలో పరిపాలన సజావుగా సాగాలంటే అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నికలు సరిగా జరగాలంటే ఎన్నికల కమిషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య పరస్పర సహకారం ఉండాలి. లేనిపక్షంలో అడుగడుగునా ఇరుపక్షాలకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇది మనం ప్రత్యక్షంగా కూడా చూసాము.

కాగా త్వరలో ఏపీ లో స్థానిక ఎన్నికలు జరగనుండగా మళ్ళీ ఎన్నికల కమిషనరుగా ఎన్నికయిన నిమ్మగడ్డ రమేష్ కు కత్తి మీద సాము అని చెప్పాలి. గతంలో స్థానిక ఎన్నికలకు నామినేషన్ జరుగుతున్న సమయంలో జరిగిన అవాంతరాలు మళ్ళీ  జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారింది. గతంలో జరిగిన విధంగా కాకుండా ఎన్నికల కమిషన్ ప్రత్యక్షముగా లేదా పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రణాళికలు చేయాలని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పుడు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు రావడం లేదని ఇటీవల హై కోర్ట్ లో పిటీషన్ వేశారు. అలాగే అదనపు సిబ్బంది నిర్వహణ మరియు ఇతర అంశాల గురించి ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనికి రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిధులను ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఎన్నికల సంఘం వారి దగ్గర 90 నుండి 100 కోట్ల వరకు నిధులున్నాయని పేర్కొంది.  ఇటువంటి వాగ్వాద, క్లిష్ట పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల నిర్వహణ కత్తి మీద సాము అని సామాన్యులు రాజకీయనాయకులు గుసగుసలాడుకుంటున్నారు. మరి త్వరలో ఏమి జరగనుందో వేచి చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: