అమరావతి.. ఈ పేరుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకనాడు ఎంతో ఉత్కృష్టమైన నాగరికత విలసిల్లిన నగరం.. బౌద్ధం నడయాడిన నేల.. ఇక్కడి పురాతన అవశేషాలు.. బౌద్ధం నాటి కట్టడాలు.. ప్రఖ్యాత బ్రిటన్ మ్యూజియంలోనూ కొలువుతీరాయంటే అమరావతికి ఎంతటి ప్రాశస్త్యం ఉందో చెప్పనక్కర్లేదు. అయితే.. అలాంటి ఓ చారిత్రక ప్రాముఖ్యత ఉన్న పేరు గొప్పదనాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు చెడకొట్టేశారా..?

ఎందుకంటే ఇప్పుడు అమరావతి అంటే ఆనాటి గొప్పదనం గుర్తుకు రావడం లేదు.. ఇప్పుడు అమరావతి అంటే ఆనాటి బౌద్ధుల ప్రత్యేకత గుర్తుకు రావడం లేదు.. ఇప్పుడు అమరావతి అంటే.. కేవలం ఓ పార్టీకి చెందిన వ్యవహారంగా కనిపిస్తోంది..ఇప్పుడు అమరావతి అంటే.. రాజకీయాలు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు పరిస్థితి ఎక్కడి వరకూ వెళ్లిందంటే.. ఇప్పుడు అమరావతి పేరును రాజధానికి పెట్టి ఆ పేరును చంద్రబాబు చెడగొట్టారని వైసీపీ నేతలు విమ‌ర్శించే వరకూ వెళ్లింది.

రాజ‌ధాని పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డ్రామాల‌ు చేస్తున్నారంటూ మంత్రి సీదిరి అప్పల‌రాజు తీవ్రంగా కామెంట్ చేశారు. ఇంకా ఎన్ని రోజులు ఈ పెయిడ్ ఆందోళ‌న‌లు నిర్వహిస్తార‌ని ఆ మంత్రి సీదిరి అప్పల‌రాజు మండిప‌డ్డారు. ప్రస్తుతం అమరావతి రాజకీయ ఎత్తుగడలకు వేదికగా మారిందని, తానే అమరావతికి పేరు తెచ్చినట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని సీదిరి అప్పల‌రాజు ధ్వజ‌మెత్తారు. అంతే కాదు.. ధ్యాన బుద్ధ విగ్రహంపై చంద్రబాబుకు పేటెంట్ లేదన్నారు సీదిరి అప్పల‌రాజు.

అమరావతి పేరును రాజధానికి పెట్టి ఆ పేరును చంద్రబాబు చెడగొట్టారన్న మంత్రి సీదిరి అప్పల‌రాజు.. ఇంకా ఎన్ని రోజులు ఈ పెయిడ్ ఆందోళనలను నడిపిస్తారో చూస్తామని వ్యాఖ్యానించారు.  టీడీపీ నేతలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, ఇంకా ఎన్ని రోజులు పెయిడ్ ఆందోళనలు నడిపిస్తారు? అంటూ మండిపడ్డారు.  పెయిడ్ దీక్షలకు కమ్యూనిస్టులు మద్దతు తెలపడం దారుణమన్నారు. రైతుల మీద నిజంగా ప్రేమ ఉంటే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి రిప్రజెంటేషన్‌ ఇవ్వాలని సూచించారు. మొత్తానికి అమరావతి వంటి చారిత్రక ప్రాముఖ్యత ఉన్న పేరు.. చివరకు ఇలా రాజీకీయాలపాలైపోయిందన్న ఆందోళన సగటు ఆంధ్రుల్లో కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: