ప్రస్తుత తెలంగాణ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి గురించి మనకు ఇదివరకే తెలిసిందే. దివంగత నేత ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈమె ఒక వెలుగు వెలిగిన సంగతి ఏ గల్లీ లీడర్ని అడిగినా చెబుతారు. ఈమెను ఆయన సొంత చెల్లి లెక్కన ఆదరించి తన మంత్రివర్గంలో చోటిచ్చారు. ఈమె కూడా అంతే నమ్మకంతో మంత్రిగా ప్రజలకు సేవచేస్తూ తన నమ్మకాన్ని నిలబెట్టుకుంది. వై ఎస్ మరణం తరువాత జరిగిన పరిణామాల వలన సబితా ఇంద్ర రెడ్డి తెలంగాణాలో రైజింగ్ లో ఉన్న తెరాస లో చేరింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆమెపై నమ్మకముంచి ఆమెకు తన కాబినెట్ లో అవకాశం కల్పించారు.  అయితే ఇప్పుడు ఈ మంత్రికి అనుకోని అవమానం ఎదురైంది. అదేమిటో తెలుసుకోవాలనుందా...కింద ఇచ్చిన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ను ఒకసారి చదవండి.

గతవారం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టం అంతా ఇంతా కాదు...ఇప్పటివరకు ఎన్నడూ రాని వర్షాలు వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వం తరపున ప్రజలను పరామర్శించడానికి వెళ్లిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేదు అనుభవం ఎదురైంది. వర్షాల వాళ్ళ నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు వెళ్ళిన మంత్రిని స్ధానికులు అడ్డుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న నష్టపరిహారం కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకు నేతలు చెప్పిన వాళ్ళకు మాత్రమే అందుతోందంటూ బాగా మండిపడ్డారు.

మంత్రి వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా, ఎంతకీ వారు వినకుండా వారిస్తూనే ఉండడంతో చేసేదేమి లేక మంత్రి  సబిత చివరకు పరామర్శలకు స్వస్ధిపలికి చెక్కులను కూడా పంపిణీ చేయకుండానే వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. ఇది సబితకు జరిగిన రెండో అవమానంగానే చూడాలి. ఎందుకంటే ఈమధ్యనే సబిత కాన్వాయ్ ను కూడా స్ధానికులు అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ప్రజలు మంత్రి పట్ల ఈ విధంగా వ్యవహరించడం మామూలే కదా అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.   

మరింత సమాచారం తెలుసుకోండి: