మైండ్ గేమ్ ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ ఎత్తుగడ కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. అయితే ఈనెల 28వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రులు, ప్రభుత్వ అధికారులు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగడానికి ఉన్న అవకాశాలు గూర్చి  చర్చిస్తారు. అయితే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి పోవాల్సిన వే దీనికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో సిద్ధంగా ఉన్నారు. అప్పటికే వైసీపీ తరఫున దాదాపుగా 20 శాతం ఏకగ్రీవంగా అంగీకరించారు.


అప్పటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య రాజకీయ విభేదాల వలన ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికలను వాయిదా వేయించారు. మరోవైపు ఎన్నికల కమిషనర్  కరోనా   కారణంగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని వాయిదా వేశారు. అయితే దేశంలో కరోనా   వ్యాప్తి ఉన్నప్పుడు కూడా.. కొన్ని ఉప ఎన్నికలు, త్వరలో జరగబోయే బీహార్ ఎన్నికలు కు అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఏపీలో కూడా స్థానిక ఎన్నికలపై త్వరలో నిర్ణయం రాబోతుంది. అయితే రాష్ట్రఎన్నికల సంఘం  ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నా వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్  ఉన్నంతవరకూ స్థానిక పోరుకు వెళ్ళకూడదని వైసిపి వర్గాలు అనుకుంటున్నాయి అని విశ్వసనీయ సమాచారం.


ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబునాయుడుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఇటీవలే ఎన్నికల సంఘానికి నిధులు ఇవ్వలేదంటూ వైసీపీ ప్రభుత్వం పై కోర్టు కు లేఖ రాశారు. అంతేకాకుండా ఆమధ్య వైసీపీ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ పదవి కాలం కూడా తగ్గిస్తున్నట్లు గా రాష్ట్ర శాసనసభలో సవరణ తీసుకొచ్చారు. దీనికి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించడంతో అమలు కాలేదు. అప్పటి నుంచి వైసిపి ప్రభుత్వానికి, ఎన్నికల కమిషనర్ కి మధ్య గొడవలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల వాయిదా పడుతూ వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: