ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి మూడు రాజధాను ఉంటాయని ఇక అమరావతి లో కొన్ని కార్యకలాపాలు జరుగుతాయని  ప్రభుత్వం నిర్ణయించడంతో అప్పటి నుంచి అమరావతి రాజధాని రైతులు మహిళా సంఘాలు ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలంటూ ధర్నాలు చేస్తున్నారు. అయితే అమరావతిలో నేటికీ ధర్నాలు చేస్తున్నది అమరావతి రాజధాని భూములు ఇచ్చిన రైతుల కుటుంబ మహిళ లేనా కాదా అన్న అనుమానం కలుగుతుందని ఇటీవల బీజేపీ నేత విష్ణువర్ధన్ చేసిన వ్యాఖ్యలు పై అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.


 విష్ణువర్ధన్ అమరావతి లో ధర్నా చేస్తున్నది 50 వేల రూపాయల చీర కట్టుకుని ఉన్న మహిళ లేని, అమరావతి రాజధాని సమస్యను నరేంద్ర మోడీకి తెలియజేస్తామని చెప్పి రాజధాని మహిళా రైతులు  ఢిల్లీలో షికార్లు చేశారని, రాజధానికి భూములు ఇచ్చిన రైతులు నిండు మోసం చేస్తున్నది రాజధాని పరిరక్షణ కమిటీ సభ్యులు, మహిళలు .రాజధానికి భూములు ఇచ్చిన రైతులు దగ్గర్నుంచి డబ్బులు వసూలు చేసుకుని ఆ డబ్బులతో అమరావతి పరిరక్షణ సమితి అని చెప్పుకొని పబ్బం గడుపుతున్నారని అన్నారు. విష్ణువర్ధన్ వ్యాఖ్యలని  వైసిపి ప్రభుత్వం కూడా అంగీకరించింది. అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు మహిళలు అందరూ రాష్ట్రంలో బిజెపి పార్టీ అంతు చూస్తామని, రాజధాని విషయం పై తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని,


సాక్షాత్తు దేశ ప్రధాని అయిన నరేంద్ర మోదీ మీ నాయకుడే వచ్చే అమరావతి శంకుస్థాపన చేశాడని గుర్తుండే మాట్లాడుతున్న రాలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి గా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు మా పోరాటం ఆగదని, రాజధాని భూములు ఇచ్చిన రైతులు త్యాగాలను నిలబెడతామని, రాష్ట్రానికి ఒక రాజధాని తప్ప 3 రాజధాని అవసరం లేవు. కేవలం వైసీపీ నాయకులు వాళ్ల రాజకీయ స్వార్థం కోసం, వారి ప్రయోజనాల కోసం మూడు రాజధానులు రాష్ట్రానికి అవసరమని అంటున్నారు అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: