ఇండియా చైనా మధ్య కొంతకాలంగా ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో చైనా ఇండియాలో ఏకంగా 1200 కిలోమీటర్ల దూరం ఆక్రమించిందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఓవైపు బీహార్‌లో ఎన్నికల ప్రచారం జోరందుకుంటున్న ఈ సమయంలో రాహుల్ గాంధీ ఇలాంటి ఆరోపణలు సంధిస్తున్నారు. అయితే ఈ మాటల్లో ఏమాత్రం నిజం లేదని.. కేవలం ఎన్నికల్లో లబ్ది కోసమే రాహుల్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.

అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అన్నది నిజమే అయినా.. మరీ దేశ రక్షణ విషయంలో కూడా ఇలాంటి విమర్శలు చేయడం ఏంటన్న ఆందోళన సామాన్య జనంలో కనిపిస్తోంది. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా పెద్దగా పట్టింపు ఉండదు. కానీ మన దేశ సైనికులు సరిహద్దుల్లో ప్రాణాలకు ఒడ్డి పోరాడుతున్న సమయంలో ఆ పోరాటన్ని తక్కువ చేసి చూపేలా.. పొరుగు దేశమే మన దేశంలోకి చొరవబడి ఏకంగా 1200 కిలోమీటర్ల దూరం ఆక్రమించిందని చెప్పడం నిజంగా బాధ్యతారాహిత్యమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇది ఇలా ఉంటే.. అసలు విషయం మరోలా ఉంది. చైనా ఇండియాకు ఇప్పుడు చాలా ప్రమాదకరమైన, బలమైన శత్రువు. అయినా సరే భారత్ మాత్రం చైనా విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. లద్దాఖ్ ప్రాంతంలో మన భూభాగాల్లోకి చొచ్చుకు రావాలని ప్రయత్నించినా.. మన భౌగోళిక సరిహద్దులు మార్చాలని ప్రయత్నించినా ఎక్కడా రాజీపడకుండా తగిన బుద్ది చెబుతోంది. అందుకే ఇండియా- చైనా సరిహద్దుల్లో తరచూ సైనిక ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. భారత్‌ కూడా ఏమాత్రం తగ్గకుండా యుద్ధానికి సైతం సై అంటోంది.


లద్దాఖ్ సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు చుక్కలు చూపించేందుకు ఇండియా రెడీ అయ్యింది.. యుద్ధానికి పూర్తి సన్నాహాలు చేసుకుంటుందా అంటే అవుననే అనిపిస్తోంది. లద్దాఖ్ ప్రాంతంలో భారత్ చేసుకుంటున్న సన్నాహాలు చూస్తుంటే ఎందాకైనా రెడీ అన్నట్టు చైనాకు సవాల్ విసురుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే.. ఇప్పటికే వేల ట్రక్కులను భారత్ చైనా సరిహద్దులకు చేర్చినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: