రాజకీయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పడే ఇబ్బందులు గురించి ఎంత చెప్పుకున్నా తరగనంత గా ఉంటుంది. 2019 ఎన్నికల్లో తమకు కనీసం 30 40 స్థానాలు వస్తాయని పవన్ భావించారు. ఏపీలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న తామే కీలకంగా మారుతామని  పవన్ అభిప్రాయపడ్డారు. కానీ ఫలితాలు చూస్తే అందుకు భిన్నంగా రావడం, కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని ఊహించలేకపోవడం వంటి ఎన్నో కారణాలు జనసేన కు ఎన్నో రకాల ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ఇక ఆ పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క   ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గెలిచిన మొదటి నుంచే పవన్ కు వీర విధే.యుడిగా ఉంటూ వచ్చారు. కానీ ఆ తర్వాత జగన్ కు జై కొట్టడం, వైసిపి కార్యక్రమాల్లో పాల్గొంటూ, జగన్ ఫోటోలకు పాలాభిషేకం చేస్తూ, ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే మాదిరిగా వ్యవహరిస్తున్నారు.


రాజోలు నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వకుండా వైసిపి వారికి ప్రాధాన్యం ఇస్తూ ఉండడం వంటి వివరాలతో పవన్ కు కాక పుట్టిస్తోందనే అభిప్రాయపడినా, పవన్ మాత్రం ఆ విధంగా ముందుకు వెళ్లలేదు. అలా వెళ్తే అసెంబ్లీలో జనసేన తరఫున ప్రాతినిధ్యం వహించేవారు కరువు అవుతారని పవన్ కు బాగా తెలుసు.అదీకాకుండా వైసీపీలోకి అధికారికంగా చేరేందుకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందనే అభిప్రాయంతో సస్పెండ్ చేయకుండా, పార్టీలోనే కోన సాగిస్తున్నారు. ఆయన మరింతగా వైసీపీ కార్యక్రమాలలో పాల్గొంటూ వస్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ పవన్ కు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి.


అయినా రాపాక ను తప్పనిసరి పరిస్థితుల్లో భరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలకు రాపాక వరప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలకు పొంతన లేకుండా తయారైంది. రాపాక విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉంటున్నా, జనసైనికులు మాత్రం తమ ప్రతాపం చూపిస్తున్నారు. అదే పనిగా సోషల్ మీడియాలో రేపాకను ట్రోల్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: