టిడిపి అధినేత చంద్రబాబు వైఖరిలో చాలా మార్పు వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు తన మిత్రులు, శత్రువులు అని చూడకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ, వారికి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. బాబులో ఒక్కసారిగా ఈ విధమైన మార్పు రావడానికి కారణం వారి పై ప్రేమాభిమానాలు పెరిగిపోవడం మాత్రం కాదు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పడుతున్న ఇబ్బందులను నుంచి బయట పడేందుకు, బాబు ఈ విధంగా అవసరం ఉన్నా, లేకపోయినా బీజేపీ నేతలను పరామర్శిస్తూ, వారికి దగ్గరయ్యేందుకు అన్ని రకాలను ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ బీజేపీ పెద్దల యోగక్షేమాలను మరి మరి అడిగి తెలుసుకుంటున్నారు.


 కొద్ది రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కరోనా వైరస్ ప్రభావానికి గురైన తర్వాత, చంద్రబాబు ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. తాజాగా ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆప్యాయంగా పలకరిస్తూ చంద్రబాబు బిజెపి నేతలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు . తాజాగా కేంద్ర మంత్రి గోయల్ ను సైతం  చంద్రబాబు పరామర్శించారు. ఇటీవల ఆయనకు కిడ్నీ లో రాళ్ళు ఏర్పడడంతో, ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. ఇదే విధంగా గత కొంతకాలంగా చంద్రబాబు సందర్భం వచ్చినా, రాకపోయినా, సమయం కల్పించుకుని బీజేపీ నేతలకు ఫోన్లు చేస్తూ వారికి దగ్గరయ్యేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు.


ఏదో రకంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా, మళ్ళీ అధికారంలోకి రావాలని ఆకాంక్షతో బాబు ఉన్నట్టు గా కనిపిస్తున్నారు. బాబు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, బిజెపి కేంద్ర పెద్దలు ఎవరూ టిడిపిని దగ్గరకు చేరదీసేందుకు ఇష్టపడడం లేదు. బాబుకి ఈ విషయం తెలిసినా , బాబు మాత్రం తన ప్రయత్నాలు ఆపకుండా కొనసాగిస్తున్నారు.జనసేన అధినేత పవన్ సహకారంతో బీజేపీ కి దగ్గరయ్యి పొత్తు పెట్టుకోవాలి అనేది బాబు ఆలోచనగా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: