ప్రత్యేకా హోదా అంశం ఎపుడూ కూడా  హాట్ టాపిక్ గానే ఉంటుంది. నిజానికి ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఎవరి సమస్యలు వారికి ఉన్నాయి. బీహార్ విషయానికి వస్తే అత్యంత వెనకబాటుతనంతో సతమతమవుతున్న రాష్ట్రం గా చెబుతారు. బీహార్ కి గత ఎన్నికల వేళ భారీ ప్యాకేజిని కూడా ప్రధాని హోదాలో మోడీ  ప్రకటించారు. సరే ఇపుడు మళ్ళీ అయిదేళ్ళు గిర్రున తిరిగేశాయి. ఈసారి ప్రత్యేక హోదా నినాదం అక్కడ గట్టిగా మారుమోగుతోంది.

ముఖ్యంగా కాంగ్రెస్, ఆర్జేడీ వంటి ప్రతిపక్షాలు ఇదే మాటను జనాల్లోకి తీసుకెళ్తూ ప్రధాని మోడీని టార్గెట్ చేస్తున్నారు. ఎన్నో మాటలు చెప్పిన కేంద్రం ప్రత్యేక హోదా బీహార్ కి ఇస్తుందా ఇవ్వదా అన్నది సూటిగా చెప్పాలని కూడా వారు కోరుతున్నారు. అయితే ఏపీలో కూడా 2014 ఎన్నికల వేళ ప్రత్యేక హోదాను బీజేపీ చెప్పింది ఆ పేరు మీద ఓట్ల పంట కూడా టీడీపీ, బీజేపీ కాంబినేషన్ పండించుకున్నారు.

కానీ ఆరేళ్ళుగా హోదా అన్న ఊసే లేదు. ఏపీలో రెండు ప్రభుత్వాలు వచ్చాయి. టీడీపీ పోయి వైసీపీ వచ్చినా హోదా ఊసు అసలు లేదు. ఈ విషయంలో ఏపీలోని అన్ని రాజకీయ పార్టీల మధ్యన ఐక్యత కూడా లేదు. కానీ బీహార్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ, నితీష్ కుమార్ తప్ప మిగిలిన పార్టీలన్నీ ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నాయి.

మరి బీహార్ కి ప్రత్యేక హోదాను కేంద్రం ప్రకటిస్తుందా, అమీతుమీగా సాగుతున్న ఈ ఎనికల  పోరులో ట్రంప్ కార్డ్ గా  ప్రత్యేక హోదాను వాడుకుంటారా అన్నది చూడాలి. ఒకవేళ బీహార్ కి హోదా ఇస్తే ఏపీకి కూడా అదే సంజీవిని అవుతుంది. మొత్తానికి బీహార్ ఎన్నికలు ఏపీ రాజకీయాలను కూడా ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. మరి ప్రధాని మోడీ మనసులో ఏముందో. ఆయన దీన్ని ఎలా అధిగమిస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: