ఇటీవల కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం మొత్తం అతలాకుతలమై పోయిన విషయం తెలిసిందే. భాగ్యనగరంలో మునుపెన్నడూ లేనివిధంగా చరిత్రలో మొదటిసారి రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో హైదరాబాద్ నగరం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఎంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరానికి ఇటీవల కురిసిన భారీ వర్షం మచ్చ తీసుకొచ్చి పెట్టింది అని చెప్పాలి. ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోయి జనజీవనం స్తంభించిపోయి ప్రజలందరూ తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇక నాళాలు  పొంగి మురికి నీరు ఇళ్లలోకి చేరడంతో నరకం అనుభవించారు నగరవాసులు




 అయితే వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇప్పటికికూడా హైదరాబాద్ నగరంలోని పలు కాలనీలు ప్రాంతాలు కూడా ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్న విషయం తెలిసిందే. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ  ఎక్కడ వరదల ప్రభావం మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలతో... వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిసిందే.  ఈ క్రమంలోనే... తెలంగాణ ప్రభుత్వం వరదబాధితుల అందరికీ సహాయక చర్యలు చేపట్టేందుకు తక్షణ సహాయం కింద 550 కోట్ల నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. అటు వివిధ రాష్ట్రాలు వరదల్లో తీవ్ర నష్టాన్ని చవిచూసిన తెలంగాణకు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి.


 ఇక వరద సాయం విషయంలో ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా నష్టపోయిన బాధితులు అందరికీ దసరా పండగకు ముందే వరద పరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని ఇటీవల అధికారులందరికీ ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దసరా కు ముందే వరద బాధితులకు నష్టపరిహారం అందిస్తేనే ప్రయోజనం ఉంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఈ క్రమంలోనే రోజుకు లక్ష మంది వరద బాధితులకు సహాయం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. కాకుండా పునరావాస, సహాయక చర్యలను కూడా యుద్ధ ప్రాతిపదికన అధికారులు చేపట్టి ప్రజలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండాలి అంటూ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: