ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని శరవేగంగా విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న  విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేవలం కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య  కాకుండా భవిష్యత్తు విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది తెలంగాణ విద్యాశాఖ. ముఖ్యంగా ఇంటర్ ఫస్టియర్ సెకండియర్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. అయితే అంతకుముందు వరకు ఇంటర్ ఫస్టియర్ సెకండియర్ హాల్ టికెట్ నెంబర్లు వేరు వేరుగా ఉండేవి అన్న విషయం తెలిసిందే.



 దీంతో రెండు హాల్టికెట్ నెంబర్ గుర్తుంచుకునేందుకు  విద్యార్థులు కాస్త ఇబ్బంది పడేవారు. అంతేకాకుండా వివిధ సందర్భాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ కాకుండా ఫస్టియర్ హాల్టికెట్ నెంబర్ ను రాసేవారు విద్యార్థులు. ఇక దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అయితే దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది ఇటీవలే తెలంగాణ ఇంటర్ బోర్డ్. ఇంటర్ ఫస్టియర్ సెకండియర్ విద్యార్థులందరికీ ఓకే హాల్టికెట్ నెంబర్ కేటాయించే విధంగా ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుని విద్యార్థులందరికీ శుభవార్త తెలిపింది.



 సాధారణంగా అయితే ఇంటర్ ఫస్టియర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వేరువేరుగా హాల్ టికెట్ నెంబర్లు ఇస్తారని తెలిపిన తెలంగాణ ఇంటర్ బోర్డు.. ఇలా ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న సమయంలో ఎంతో మంది ఇంటర్ విద్యార్థులు పొరపాటున ఫస్టియర్ హాల్టికెట్ నెంబర్ రాస్తున్నారని తద్వారా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే  పరిస్థితులు వస్తున్నాయని తెలిపింది. అందుకే రానున్న రోజుల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్ ఫస్టియర్ సెకండియర్ విద్యార్థులకు ఒకే హాల్ టికెట్ నెంబర్ కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇంటర్ విద్యార్థులు అందరికీ శుభ వార్త అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: