నిన్న మొన్న వరకు తెలంగాణను ,అటు ఆంధ్రాను ముంచేసిన వర్షాల కారణంగా ప్రజలు ఇంకా కోలుకోలేదు.. ఇప్పటికీ రెండు రాష్ట్రాలలోనీ కొన్ని ప్రాంతాల్లో ఇంక వరద నీరు వస్తుంది. అయితే అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి వరద నుంచి ప్రజలను బయటకు తీసుకొస్తున్నారు. ఈ ఘటన మరువక ముందే మరో రాష్ట్రంలో అదే వర్షం.. అదే వరదలతో ముంచేస్తుంది.. దక్షణాది నగరాలు ఒక్కొక్కటి వర్షంతో తడిసి పోతున్నాయి. ప్రస్తుతం బెంగుళూరు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతుంది.


నిన్న మధ్యాహ్నం నుంచి కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తుంది. ముఖ్యంగా బెంగుళూర్ లో వర్షం ముంచేస్తుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీ గా నగరం మొత్తం వరద నీరు వచ్చి చేరుతోంది.మధ్యాహ్నం 2.30 గంటల నుంచి చినుకు చినుకుగా మొదలైన వాన చూస్తుండగానే కుండపోతగా మారింది. ఆ వాన బీభత్సం 5.30 గంటల వరకూ కొనసాగింది. ఇంకేం.. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లన్నీ నీటితో నిండాయి... నగరం లోని ప్రధాన నగరాలన్నీ కూడా నీళ్లతో నిండిపోయాయి. ఇక రోడ్లు అన్నీ నదులను తలపిస్తున్నాయి.



బెంగుళరులోని పలు ప్రాంతాల్లో నీరు ఇళ్లలోకి చేరడం తో ప్రజలు భయపడుతున్నారు. నిన్న నుంచి కొనసాగుతున్న వర్షాలకు నగరం మొత్తం నీటిమయం అయ్యింది. నగర శివార్లలోని హోసకెరిహళ్లి ప్రాంతం లోని గురుదత్తా లేఔట్‌లో వరద ప్రవాహం లో ఓ కారు కొట్టుకుపోయింది. స్థానికులు ఆ దృశ్యాన్ని తమ సెల్ ‌ఫోన్ల లో చిత్రీకరించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.. ఈ మేరకు బెంగుళూర్ లో 13.3 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.. ఆర్‌ఆర్ నగర్, కోరమంగళ, నగరబావి, మల్లేశ్వరం తదితర ప్రాంతాల్లో వర్షంతో అతలాకుతలమయ్యాయి.  మరో 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు..


మరింత సమాచారం తెలుసుకోండి: