భారత ఆర్మీ క్యాంటీన్ లో ఇక మీదట విదేశాల నుంచి వస్తున్న అన్నీ రకాల వస్తువులను నిషేదించినట్లు తెలుస్తుంది. ఈ విషయం పై కీలక చర్చలు చేపట్టిన భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. భారత దేశంలో మొత్తం 4000 మిలటరీ క్యాంటీన్లు ఉన్న విషయం తెలిసిందే.. విదేశీ వస్తువులను కొనుగోలు చేయరాదని కేంద్రం ఆదేశించినట్టు రాయిటర్స్ పేర్కొంది. ఇది డియాజియో, పెర్నోడ్ రికార్డ్ వంటి విదేశీ మద్యం సంస్థలకు ఓ విధంగా ఇది మింగుడు పడదు అని చెప్పాలి..



స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలన్న ప్రధాని నరేంద్ర పిలుపు మేరకు అక్టోబర్ 19 న ఈ విషయం పై పలు చర్చలు జరిపి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆర్మీ క్యాంటీన్లలో 6 నుంచి 7 శాతం వరకు విదేశీ వస్తువులు ఉన్నట్లు తెలుస్తోంది. డైపర్స్, వాక్యూమ్ క్లీనర్లు, హ్యాండ్‌బ్యాగ్స్, ల్యాప్‌టాప్‌లు వంటి చైనా ఉత్పత్తులు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి.  డియాజియా, పెర్నెడ్ వంటి విదేశీ మద్యం కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నట్లు సమాచారం. విదేశీ మద్యం సంస్థల నుంచి వచ్చే ఏడాది మద్యం కొనుగోలు ను నిలిపి వేస్తున్నట్లు రాయిటర్స్ వెల్లడించారు.



ప్రతి ఏడాది ఆర్మీ క్యాంటీన్లలో 17 మిలియన్ల విలువైన విదేశీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. విదేశీ పెట్టుబడులను పెంచే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.. అయితే ఇప్పుడు విదేశీ వస్తువుల కొనుగోలు ను ఎందుకు నిలిపివేసింది అని విదేశీ ఎగ్జిక్యూటివ్ సంస్థ తీవ్రంగా ఖండించింది. ఇలా చేయడం వల్ల మన దేశానికి , విదేశాలకు ఉన్న సంబంధాలు పూర్తిగా దెబ్బ తింటాయని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం మాత్రం విదేశీ మద్యం అందుబాటులో ఉంది. కానీ అందరికీ అందుబాటు లో ఉండదు.. జూన్ నుంచి పూర్తిగా మద్యం పాటుగా విదేశీ వస్తువులు కూడా దొరకవు..ఇది మందుబాబులకు చేదు వార్తే...

మరింత సమాచారం తెలుసుకోండి: