కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మీ క్యాంటీన్లలో దిగుమతి చేసుకున్న వస్తువులను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దిగుమతి చేసుకున్న వస్తువును కొనుగోలు చేయడం మానేయాలని దేశంలో ఉన్న 4000 ఆర్మీ క్యాంటీన్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు ఆర్మీ క్యాంటీన్లలో విదేశీ మద్యం అమ్మకాలు కూడా నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ అక్టోబర్ 19వ తేదీన అంతర్గత ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు సమాచారం.

న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రెంచ్ కంపెనీ పెర్నోడ్ రిచర్డ్, యూకే కంపెనీ డియాజియోకు చెందిన స్కాచ్ మద్యం బాటిళ్ల అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్ మెంట్ విదేశీ మద్యం బ్రాండ్ల ఆర్డర్లను ఆపివేసింది. ఈ ఏడాది మే, జూలై నెలలో భారత సైనిక, వైమానిక, నావికా దళ ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్రమోడీ సమావేశమయ్యారు. విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఈ విషయంపై స్పందించడానికి నిరాకరించారు. ఏ ఉత్పత్తులను నిషేధించాలో జాబితా వెలువడలేదన్నారు. కానీ పరిశ్రమ వర్గాలు మాత్రం విదేశీ మద్యం నిషేధిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై డియోజియో, పెర్నోడ్ ప్రతినిధులు వ్యాఖ్యానించేందుకు తిరస్కరించారు. అయితే డిఫెన్స్ స్టోర్లలో దిగుమతి చేసుకున్న అమ్మకాలు కేవలం 17 మిలియన్ డాలర్లేనని, ఈ బ్రాండ్లను నిషేధించినా కలిగే నష్టమేమి లేదన్నారు. స్టాక్ తక్కువగానే కొనుగోలు చేస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.

దేశవ్యాప్తంగా 5000 క్యాంటీన్ స్టోర్స్ లను డిపార్ట్ మెంట్ నిర్వహిస్తోంది. వీటిలో మద్యంతో పాటు ఎలక్ట్రానిక్స్, నిత్యావసర సరుకులు, వస్తువులు తక్కువ రాయితీతో సైనికులు, మాజీ సైనిక కుటుంబాలను విక్రయిస్తోంది. రిటైల్ మార్కెటింగ్ క్యాంటిన్ స్టోర్స్ 2 బిలియన్ డాలర్లకుపైగా వార్షిక అమ్మకాలు చేస్తున్న అతి పెద్ద కంపెనీగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: