ప్రస్తుతం ఉల్లి  ధరలు కొండెక్కి కూర్చున్న విషయం తెలిసిందే. ఉల్లి దిగుబడి తగ్గిపోవడంతో ఉల్లి  ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. దీంతో భారీగా ధరలు పెరిగిపోయాయి. మరోసారి సామాన్య ప్రజలకు ఉల్లి భారంగా మారింది. దీంతో సామాన్య ప్రజలకు ఉల్లి కోయకుండానే కన్నీళ్లు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కరోనా  వైరస్ ప్రభావం దృశ్య కూరగాయల ధరలు పెరిగి సామాన్య ప్రజలందరూ బెంబేలెత్తి పోతుంటే..  ఉల్లి ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ప్రజలు మరింత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్న విషయం తెలిసిందే.



 దాదాపు ఉల్లి కిలో ధర వంద రూపాయలకు పైగానే పలుకుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలందరూ ఉల్లి కొనుగోలు చేయాలంటేనే వణుకుతున్నారు. గతంలో లాగానే ఉల్లి ధరలు భారీగా పెరిగిపోవడంతో అటు వైపు చూడకుండా మళ్ళి ఉల్లి  లేకుండానే వంటలు  వండుకునే పరిస్థితులు మళ్ళీ వచ్చేశాయి. ఇక దేశంలో ఉల్లి కొరత భారీగా ఏర్పడి ప్రస్తుతం భారీగా డిమాండ్ ఏర్పడి కూడా భారీగా ధర పలుకుతున్న నేపథ్యంలో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉల్లి కష్టాలు తీర్చేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.



 ప్రస్తుత కాలంలో మార్కెట్ లో ఉల్లి ధర దాదాపు వంద రూపాయలకు పైగానే పలుకుతున్న నేపథ్యంలో ఈ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఇప్పటికే ఉల్లి  నిల్వలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు బఫర్  స్టాక్ నుంచి ఉల్లిని తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా కేంద్రం అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలోనే అసోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బీహార్ చండీగఢ్ హర్యానా తమిళనాడు రాష్ట్రాలు ఎనిమిది వేల టన్నుల ఉల్లి తీసుకునేందుకు సిద్ధమయ్యాయని ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే బఫర్  స్టాప్ నుంచి ఉల్లి  సేకరణకు గాను కేవలం 26 రూపాయల ధరకే రాష్ట్రాలకు పంపిణీ చేస్తామని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: