భారత రైల్వే శాఖ రైల్వే ప్రయాణికుల అందరికీ ఎప్పటికప్పుడు మెరుగైన సర్వీసులు అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొన్నటివరకు కరోనా  వైరస్ కారణంగా నిలిచిపోయిన రైల్వే సర్వీసులను మళ్ళీ పునరుద్ధరిస్తూ ప్రస్తుతం ప్రయాణికులు అందరికీ ఊరట కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఈ పండుగ సీజన్లో అత్యధికంగా ప్రత్యేక రైళ్ల సర్వీసులను రైల్వే ప్రయాణికులు  అందరికీ ఈ పండుగ సీజన్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కీలక నిర్ణయం తీసుకుంది భారత రైల్వేశాఖ. ఇక ఇప్పుడు ప్రయాణికులు అందరికీ మరోసారి శుభ వార్త చెప్పింది.


 సాధారణంగా రైల్వే ప్రయాణాలు చేసే ప్రయాణికులందరూ తమ లగేజీని తీసుకెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా లగేజీని తీసుకెళ్లే సమయంలో రైళ్లలో దొంగల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి... తమ లగేజి  కీ  రాత్రింబవళ్లు కాపలాగా ఉండాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఇక నుంచి ఈ కష్టాలను ప్రయాణికులు అందరికీ తీర్చేందుకు భారత రైల్వే శాఖ సరికొత్త సేవలను అందించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక నుంచి రైల్వే ప్రయాణికుల లగేజీని  ప్రయాణికుల వెంట మోసుకు వెళ్లి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.



 ఈ పని మొత్తం స్వయంగా రైల్వేశాఖ  చూసుకునేందుకు ప్రస్తుతం భారత రైల్వే శాఖ సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. కేవలం నామమాత్రపు ఫీజు తోనే ఈ సేవలను అందించనున్నట్లు ఇటీవల భారత రైల్వే శాఖ ప్రకటించింది. ఇక మొదట ఈ సేవలను దేశ రాజధాని ఢిల్లీ సహా ఘజియాబాద్ గురుగ్రామ్ రైల్వేస్టేషన్లో ప్రారంభించేందుకు భారత రైల్వే శాఖ కసరత్తులు చేస్తోంది. దీనికోసం బ్యాగ్ ఆన్ వీల్స్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ కూడా రైల్వే ప్రయాణికుల అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. కాగా దేశంలో ఇలాంటి సేవలు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ఇది ప్రయాణికులకు గొప్ప శుభవార్త అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: