జగన్ సీఎం అయిన దగ్గరినుంచి చంద్రబాబు వైఖరి ప్రజలకు ఏమాత్రం రుచించట్లేదు.. జగన్ తో కలిసి ఏ ఒక్క విషయంలో కూడా చంద్రబాబు ముందుకు రాలేదు కదా కనీసం మద్దతు కూడా తెలపలేదు.. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పక్ష నేతలు సైతం తనను పొగడాలి అనుకునే చంద్రబాబు ఇప్పుడు దాన్ని మరిచి జగన్ ని విమర్శించడం ప్రజలు గమనిస్తున్నారు..పోయిన ఎన్నికల్లో సీఎం అయిన తర్వాత జగన్ స్పోర్టివ్ గా తీసుకుని కొన్ని విషయాల్లో చంద్రబాబు కు సహకరించారు.. కానీ చంద్రబాబు ఇన్ని ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది కూడా తన కన్నా చిన్నవాడైన జగన్ ని ఒరవకుండా ఉండడం ఎవరికీ నచ్చడం లేదు..

ఇదిలా ఉంటె చంద్రబాబు ది ఇప్పుడు ఒకటే లక్ష్యం.  గాడి తప్పిన పార్టీ ని మళ్ళీ బలపరచడం. ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉందొ అక్కడ పార్టీ ని సరైన దారిలో నడిచేలా చేయడం.. అందుకోసమే దాదాపు సంవత్సరంనర తర్వాత అయన పార్టీ బలోపేతానికి పూనుకున్నాడు.. ఓడిపోయిన తర్వాత చంద్రబాబు దాదాపు ఇంటికే పరిమితమయ్యాడని చెప్పొచ్చు.. తండ్రి కొడుకులు పార్టీ ని గాలికొదిలేసి ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నారు.. అయితే ఇప్పుడు మాత్రం చంద్రబాబు ఎందుకు మెలకువ వచ్చిందో తెలీదు కానీ పార్టీ కోసం చాలా కష్టపడిపోతున్నారు.. ఆ క్రమంలోనే ఇటీవలే పార్లమెంట్ ఇన్ ఛార్జ్ లను నియమించారు.. ఒక్కో పార్లమెంట్ కి ఒక్కో అభ్యర్థి ని నియమించి పార్టీ బలపడేలా చేయాలనీ, పోయిన నమ్మకాన్ని తెచ్చుకునేలా చేయాలనీ చంద్రబాబు సూచించారు..

ఇక స్థానిక ఎన్నికల విషయంలో చంద్రబాబు తెలివిగా వ్యవహరిస్తున్నాడని తెలుస్తుంది..స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయా రావా అనేది పక్కన పెడితే వస్తే రాజకీయ పార్టీలు ఏ విధంగా వ్యవహరిస్తాయి అనే దానిపైనే రాజకీయ వర్గాల్లో ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి.ఏది ఏమైనా ఈ ఎన్నికల విషయంలో  తెలుగుదేశం పార్టీ రాజకీయంగా సిద్ధమవుతోంది. ఎంపీ గల్లా జయదేవ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. దసరా తర్వాత గల్లా జయదేవ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షులతో చర్చలు జరిపి ఆ తర్వాత కొన్ని వ్యూహాలను సిద్ధం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎకగ్రీవాలను బలవంతంగా నిర్వహిస్తే ఏం చెయ్యాలి అనే దానిపై కూడా ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళే అవకాశం ఉంది. ఇక ఎకగ్రీవాలు అయిన చోట ఏ విధంగా వ్యవహరించాలి అనే దానిపై కూడా చర్చిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: