మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ పరిస్థితి చాల అధ్వాన్నంగా తయారైందన్న సంగతి తెలిసిందే..ఓటమి భారంతో చంద్రబాబు ఉంటే ఒక్కొక్కరు గా టీడీపీ పార్టీ ని వీడుతూ తమ్ముళ్ళు చంద్రబాబు ను ఒంటరి చేస్తున్నారు.. వాస్తవానికి జగన్ ప్లాన్ కూడా అదే.. అందరు పార్టీ ని వీడి చంద్రబాబు ను ఒంటరి చేయడం.. ఇప్పటివరకు తనమీద తీర్చుకున్న పగని జగన్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ఇలా పార్టీ కి ఒక్కొక్కరిని దూరం చేస్తూ పార్టీ పునాదులు లేకుండా చేస్తున్నాడని చెప్పొచ్చు.. ఇప్పటికే దాదాపు టీడీపీ లో మెయిన్ మెయిన్ లీడర్లు అందరు దూరమైపోయారు. ద్వితీయ శ్రేణి లీడర్లతో చంద్రబాబు తన పార్టీ ని నడిపించుకోవాలి.. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో తం ఉనికి చాటుకోవడం కోసం చంద్రబాబు కొన్ని రోజులనుంచి మోడీ భజన చేస్తున్న సంగతి తెలిసిందే..

తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్ధతు ప్రకటించడం ద్వారా బీజేపీ అధిష్టానానికి చేరువయ్యే మార్గం దక్కుతుందని చంద్రబాబు ఆశిస్తున్నారు.  చంద్రబాబు ప్లాన్ అయితే బాగుంది కానీ తాము అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీ కి టీడీపీ మద్దతు ఎక్కడ అవసరమొస్తుందనేది చూడాలి. అంతేకాకుండా కేంద్రంలో ప్రతి చిన్న విషయానికి బీజేపీ కి సపోర్ట్ చేస్తూ వారి అనుగ్రహం కోసం తహతహ లాడుతున్నారు..

అమిత్ షాకు ఫోన్ చేసి పరామర్శించిన తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న కేంద్ర మంత్రి గోయల్‌ను కూడా ఫోన్లో పలకరించారు. కిడ్నీలో రాళ్లు రావడంతో గోయల్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. బీజేపీతో పరిచయాలు పెంచుకోవడానికి చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని వీటి ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో రహస్యమేం లేదు. చంద్రబాబు మాటలు కలిపితే… ఎంతటి వారిననయినా.. తన ప్రతిపాదనలకు అంగీకరింపచేస్తారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. మరి వచ్చే ఎన్నికల నాటికీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబు కి ఈ ఎత్తుగడ ఏవిధంగా ఉపయోగపడుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: