ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువగా పెరిగిపోతుంది అన్న విషయం తెలిసిందే. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఎక్కువగా స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడడం ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తునప్పటికీ ఎక్కడ స్మార్ట్ ఫోన్ వాడకంలో మాత్రం మార్పు రావడం లేదు. ఇక ఈ మధ్య కాలంలో అయితే పెద్దల కంటే ఎక్కువగా పిల్లలే స్మార్ట్ఫోన్ వాడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పిల్లలకు స్మార్ట్ఫోన్ ఇవ్వడంపై ఎప్పటికప్పుడు మానసిక నిపుణులు తల్లిదండ్రులను హెచ్చరిస్తూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే.



 పిల్లలకు స్మార్ట్ఫోన్ ఇవ్వడం అంటే తల్లిదండ్రులు స్వయంగా వారికి ఒక గ్రామ్ కొక్కయిన్  ఇచ్చినట్లే అని మానసిక శాస్త్రవేత్తలు ప్రస్తుతం తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో ఫోన్ ఎక్కువగా వాడుతున్న చిన్నారులు ఆలోచనాశక్తి క్రమక్రమంగా క్షీణించిన మందగిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలు తమ పనికి అడ్డు పడకుండా ఉండేందుకు వారికి స్మార్ట్ఫోన్లు అప్పగించడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని... దీని వల్ల ఎంతో మంది చిన్నారులు ఆటలకు దూరమై స్మార్ట్ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారని  తద్వారా మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారని వైద్య నిపుణులు గుర్తించారు.



 పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వడం అంటే ఒక మద్యం సీసా లేదా ఒక గ్రామ్ కొక్కయిన్  ఇచ్చినట్లే అంటూ వైద్య నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వినియోగించే చిన్నారుల మెదడు క్రమక్రమంగా మద్యం సేవించిన వారిలాగా  మొద్దుబారిపోతు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాకుండా సాధారణ లైటింగ్ కంటే ఎక్కువ కాంతిని వెదజల్లే స్మార్ట్ఫోన్ వినియోగం ద్వారా కంటి చూపు కూడా మందగించే ప్రమాదం ఉంటుందట. అయితే పిల్లలకు అధునాతన టెక్నాలజీ పరిచయం చేయడం తప్పు లేదు కానీ బానిసలుగా మార్చేంతలా  స్మార్ట్ఫోన్లను అప్పగించడం మాత్రం ముమ్మాటికీ తప్పే అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: