తెలంగాణాలో ఎన్నికల జోరు ఊపందుకుంది.. ఇప్పటికే దుబ్బాక ఎన్నికల నోటిఫికేషన్ రాగ నవంబర్ 3 న ఈ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.. గ్రేటర్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్దమవుతుంది.. అయితే ఇన్నాళ్లు తెలంగాణాలో టిఆర్ఎస్ పార్టీ కి ఎదురు లేదన్నది వాస్తవం.. ఇప్పుడు కూడా ఎదురు లేదు కానీ ప్రతిపక్షాలు తామంటే తాము టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం అని చెప్తూ గులాబీ నేతలను నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది.. ఎవరు తెలంగాణ లో ప్రతామ్నాయ పార్టీ అనేది ప్రజలు చూసుకుంటారు చేయాల్సిన పని చేయమని గులాబీ నేతలు అంటుంటే కాంగ్రెస్, బీజేపీ పార్టీ అధికారమే లక్ష్యం గా సాగిపోతూ ప్రజలను చిరాకు పెట్టిస్తున్నారు..

ప్రజల్లో ఎలాంటి బలం లేని కాంగ్రెస్ పార్టీ , ఒక్క నాయకుడు కూడా సరిగ్గా లేని కాంగ్రెస్ పార్టీ అయితే నిజంగా అధికారంలోకి వస్తున్నట్లు మాట్లాడడం టిఆర్ఎస్ నేతలకు నవ్వు తెప్పిస్తుంది..అంతేకాదు పాసింగ్ క్లౌడ్స్ లాంటి నాయకులూ స్థిరంగా ఉండే గులబి పార్టీ ని విమర్శించడం హాస్యాస్పదం గ ఉంది..  ఇక పోతే తాను అనుకుంది చేసుకుంటూ పోయే కేసీఆర్ తొలిసారి ఓ నిర్ణయం విషయంలో తన మనసు మార్చుకుని  తలొగ్గారు.. పార్టీ లో తనదే ఫైనల్ నిర్ణయం గా కెసిఆర్ వ్యవహరించేవారు.. కానీ రైతుల విషయంలో తలొగ్గక తప్పలేదు.. ఇటీవలే తెలంగాణలో రైతులు పండిన మొక్కజొన్న పంటను ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని ప్రకటించారు.

నిన్నటి వరకూ కేసీఆర్… మక్కలకు మద్దతు ఇచ్చి కొనుగోలు చేయడం అసాధ్యమని చెబుతూ వస్తున్నారు. ప్రభుత్వం వేయవద్దని చెప్పినా.. రైతులు పండించారని ప్రభుత్వం వాదిస్తూ వస్తోంది. అయితే.. కొద్ది రోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతుల ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులు చేసే పరిస్థితి వచ్చింది. దీంతో కేసీఆర్ దిగిరాక తప్పలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మక్కలను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు

మరింత సమాచారం తెలుసుకోండి: