చంద్రబాబు రాజకీయ జీవితానికి స్వస్తి పలికే సమయం దగ్గరికొచ్చిందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.. అందుకు కారణం పార్టీ దారుణ ఓటమి తో పాటు,తాను ఎంతో నమ్మి పెంచి పోషించిన నాయకులూ తనకే వ్యతిరేకంగా పనిచేయడం.. ఇక్కడ బలం అనుకున్న ప్రాంతాలు కూడా ఎంతో కుదేలయిపోయి వైసీపీ పంచన చేరిపోయింది.. ప్రజలు ఎందుకు అంత మార్పు కోరుకున్నారో తెలీదు కానీ టీడీపీ కి మాత్రం దారుణంగా ఓడిపోయింది. అయితే  టీడీపీ కూడా ఓటమి చెందిన ఇన్నాళ్ల తర్వాత ఎక్కడ పొరపాటు జరిగింది అన్న అంశంపై దిద్దుబాటు చర్యలకు దిగింది..

చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడు చాలామంది నేతలను గుడ్డిగా నమ్మి వారు ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోలేదు.. దాంతో ప్రజలు పలుమార్లు హెచ్చరించినా చంద్రబాబు చూసి చూడనట్లు ఉండడంతో ప్రజలు ఈ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పారన్నది అందరికి తెలిసిన విషయం.. అయితే ఇప్పుడు చంద్రబాబు దీనిపై సరైన అవగాహనా పెంచుకుని ముందుకు వెళ్తుంటే నేతలు మాత్రం అవేమీ పట్టించుకోవట్లేదట.. కొంతమంది మాత్రం చంద్రబాబు మెచ్చే విధంగా చేస్తూ అయన తాయిలాలు అందుకుంటున్నారు..

జగన్ చాలా పెద్ద నేరం చేశారు కాబట్టి ఆయన ఇక ఇంటికే అని మాజీ ఎంపీ సబ్బం హరి అంటున్నారు. ఆయన ఒక టీడీపీ అనుకూల ఛానల్ లో మాట్లాడుతూ జగన్ తప్పుడు సలహాలతో చేసిన తప్పుడు పని ఇది అంటున్నారు. ఆయన అలా చేసి ఉండకూడదు అని కూడా చెబుతున్నారు. జగన్ సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి మీద ఫిర్యాదు చేస్తూ లేఖ రాయడం ముమ్మాటికీ ఆయన కుర్చీకి ఎసరు పెట్టేదే అని కూడా తేల్చేస్తున్నారు. ఇక జగన్ మాజీ అవుతారు. ఆయన ప్లేస్ లో సతీమణి భారతి కానీ, తల్లి విజయమ్మ కానీ కొత్త సీఎం అవుతారని కూడా జోస్యం చెబుతున్నారు. వైసీపీలో లుకలుకలు స్టార్ట్ అయిపోయాయని కూడా అనుకూల మీడియా హోరేత్తించేస్తోంది. సీఎం పదవిని కుటుంబ సభ్యులకు ఇస్తే పార్టీలో ముసలం వస్తుందని అంటోంది. సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రేసులో ఉన్నారని కూడా ప్రచారం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: