ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడు పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించగానే పదవిలోకి వచ్చి నానా హంగామా చేస్తున్నారు..  టీడీపీ మాజీ మంత్రి, కీలక సభ్యుడు, చంద్రబాబు బంటు కుడి భుజం అయిన అచ్చెం నాయుడు ఇటీవలే  ఈ ఎస్ ఐ స్కాం కేసులో జైలుకి వెళ్లి చాలారోజుల తర్వాత విడుదల అయిన సంగతి తెలిసిందే.. ఆంధ్రప్రదేశ్ లో కలవరం సృష్టించిన ఈ ఎస్ ఐ స్కాం లో ప్రధాన నిందితుడిగా భావించి అచ్చెన్న ను పోలీసులు అరెస్ట్ చేయగా పలుమార్లు బైలు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.. ఎట్టకేలకు ఇటీవలే నిభంధనలతో కూడిన బెయిల్ ని ఇవ్వగా కరోనా వచ్చిందన్న వార్తలు ఆయనపై చాల వైరల్ అయ్యాయి..

2019 ఎన్నికల్లో ఘోర ఓటమి చెందిన తర్వాత టీడీపీ పార్టీ ని చాలామంది నమ్మకస్థులు గాలికి వదిలేశారు..కష్ట సమయాల్లో పార్టీ ని ఆదుకుంటారని ఎంతో మంది మీద ఆశలు పెట్టుకున్న చంద్రబాబు ని అందరు మోసం చేసి ఇప్పుడు ఎలాంటి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఒంటరిని చేశారు.. అయితే అచ్చెన్న మాత్రం పార్టీ ఓడిపోయినా నాటినుండి చంద్రబాబు కు, పార్టీ అండగా ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు.. ఒకవిధంగా అచ్చెన్న ను అధికార పార్టీ టార్గెట్ చేసినా చంద్రబాబు వైపు నిలబడడం తో చంద్రబాబు కి అచ్చెన్నా గతంలోకంటే ఇప్పుడు బాగా నచ్చేశారట.. దాంతో ఇప్పటికే అధ్యక్ష పదవిలో ఉన్న కళావెంకట్రావు ని తప్పించి టీడీపీ రాష్ట్ర కిరీటాన్ని అచ్చెన్నకు టాక్..

ఇకపోతే అచ్చెన్న పదవిలోకి రాగానే వైసీపీ ని టార్గెట్ చేస్తూ చాలా వ్యాఖ్యలు చేశారు.. ముఖ్యంగా స్థానిక ఎన్నికల అంశంలో టీడీపీ వైసీపీ ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతోంది..స్థానిక సంస్థల ఎన్నికలపై అచ్చెంనాయుడు తమలోని భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ భయపడుతోందంటూ మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే వైసీపీ అడ్డుపడుతోందంటూ మాట్లాడారు. ప్రజా వ్యతిరేకత చూసే వైసీపీ వెనుకంజ వేస్తోందని అధికార పార్టీ నేత మాదిరిగా చెప్పుకొచ్చారు.ఆది నుంచి ఎన్నికలను అడ్డుకున్న టీడీపీ నేతలు.. ఇప్పుడు అధికార పార్టీ అడ్డుకుంటోందని విమర్శించడం విడ్డూరంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పైగా వైసీపీ ఎన్నికలకు భయపడుతోందంటూ అచ్చెం నాయుడు తమలోని భయాన్ని దాచుకునే ప్రయత్నం చేయడంలో ఆయనకున్న రాజకీయ అనుభవం బాగా ఉపయోగపడినట్లుగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: