ఎన్నికల్లో ఓడిపోయినప్పటినుంచి చాలా ప్రాంతాల్లో టీడీపీ జెండా ఎగరవేసే నాథుడే కరువైపోయాడని అనొచ్చు. కరోనా రావడంతో పార్టీ అధినేత ఇంటికే పరిమితమైపోయారు.. అయన కొడుకు సంగతి సరే సరి.. ఇద్దరు ఇంట్లో ఏం చేస్తున్నారో తెలీదు కానీ పార్టీ ను అయితే మాత్రం గంగలో కలిపేశారు.. ఎంతో కొంత పార్టీ కి కొంత పట్టు ఉన్న ప్రాంతాలను కూడా గాలికి వదిలేసి భవిష్యత్ అనేది లేకుండా చేసుకుంటున్నారు.. అయితే ఎక్కడ ఓడామో అక్కడే గెలిచి మళ్లీ జెండా పాతాలన్న లక్ష్యం రాజకీయ నేతలకు ఉండాలి.  అలాంటిది టీడీపీ నేతల్లో ఎవరికీ లేదు.. ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా టీడీపీ నేతలకు ఈ విషయంలో అస్సలు పట్టింపు లేదు.. కరోనా తగ్గుముఖం నేపథ్యంలో ఇప్పుడిప్పుడే టీడీపీ నేతలు ప్రజల్లోకి వస్తున్నారు..

మొదటినుంచి వారి రాజకీయం ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే..పాము చావదు , కార్ర విరగదు న్నట్లు వారి రాజకీయం ఉంటుంది..  చంద్రబాబు రాజకీయానికి, తమ్ముళ్ల రాజకీయానికి పెద్దగా తేడాలేదు.. వారి రాజకీయాం ఎఫెక్ట్ తో రాష్ట్రనికి చాల చెడ్డ పేరు వస్తుంది అని చెప్పనవసరం లేదు.. . ఆ పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు ప‌లు కేసుల్లో అరెస్ట్ అవుతుండ‌డం, జైలు కెళ్తుండ‌డం చూస్తూనే ఉన్నాం. మ‌రికొంద‌రు బెదిరింపుల‌కు పాల్ప‌డుతూ తాము అనుకున్న‌దే జ‌ర‌గాల‌నే ధోర‌ణిలో ఉంటున్నారు. ఇందుకు దాడుల‌కు పాల్ప‌డ‌డానికి కూడా వెన‌కాడ‌డం లేదు.

మంగ‌ళ‌గిరిలో జ‌రిగిన ఘ‌ట‌నే ఇందుకు నిద‌ర్శ‌నం. మంగళగిరి నుంచి మందడం వికేంద్రీకరణ దీక్షకు వెళ్తూ ఉండగా కృష్ణాయపాలెంలో పేదలను తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకున్నారు. ట్రాక్టర్లను అడ్డుపెట్టి పేదల ఆటోలు అడ్డుకున్న టీడీపీ నేతలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడారు. దీనిపై స్పందించిన మహిళలు టీడీపీ నేతల దౌర్జన్యాన్ని నిరసిస్తూ కృష్ణాయపాలెం రోడ్డుపై బైఠాయించారు. తమపై దాడికి యత్నించిన టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: