ఆంధ్ర ప్రదేశ్ లో ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్రలో ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అతి వేగం ప్రమాదం అని ఎంత చెప్తున్నా కూడా వాహనదారులు పెడ చెవిన పెడుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ సక్రమంగా పాటించలేదు.. దీంతో ఈ ప్రమాదాలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. ఇటీవల విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదం మరువక ముందే మరో ఘటన వెలుగు చూసింది.. విహాహ శుభకార్యానికి వెళ్తున్న ఓ వ్యాన్ రోడ్డు ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణించిన చాలా మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.



వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.మాడుగుల మండలం, గడుతురు ఘాట్ రోడ్డు మగతపాలెం సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో పెళ్లి కొడుకుతో పాటు ఓ మహిళ, ఆరుగురు మగవాళ్ళు మృతి చెందారు.ఈ ఘటనలో మరో ముప్పై ఐదు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఐదుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.  



పెళ్లి కోసం వ్యాన్ లో వెళ్ళిన వాళ్లంతా తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగం ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. వెంటనే ఈ ఘటన పై స్థానికులు స్పందించి.. గాయపడ్డ వారందరినీ జి.మాడుగుల ఆస్పత్రికి తరలించారు. బాధితులు జీకే వీధి మండలం రింతాడా పంచాయతీ కడుగుల గ్రామస్తులని తెలిసింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాద సమయంలో వ్యాన్ లో 35 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా, 9 మందిని ఆసుపత్రికి తరలించారు.. పరిస్థితి విషమంగా ఉండటంతో అందులో ఆరుమంది చనిపోయారు.మిగితా ముగ్గురు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు.గాయాలపాలైన వారు కుటుంబీకులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి...


మరింత సమాచారం తెలుసుకోండి: