గతంలో ఎప్పుడు లేనంతగా బీజేపీ పార్టీ రెండు తెలుసు రాష్ట్రాల్లో బలపడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.. గతంలో ఉందా లేడా అన్నట్లు ఉండే ఈ పార్టీ ఇప్పుడు ఏకంగా అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసి అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. తెలంగాణాలో ఇప్పటికే కొద్దిగా బలపడిన బీజేపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బలపడడానికి ఎంతో దూకుడుగా ప్రజల్లోకి పార్టీ ని దూసుకేల్లెలా చేస్తున్నాడు కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు.. గతంలో ఏ అధ్యక్షుడు చేయనివిధంగా పార్టీ ని తొందరలోనే ప్రజల్లో కి తీసుకేల్లెలా పనిచేశారు.. ఇప్పుడు టీడీపీ తర్వాత బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీ అంటున్నారంటే అదంతా సోము చలవే అని చెప్పాలి..

ఇక రాజకీయంలో భాగంగా సోము వీర్రాజు జనసేన తో చేతులు కలిపి ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే.. పవన్ కళ్యాణ్ కి ఎంతో దగ్గరైన సోము వీర్రాజు అయన తో చేతులు కలిపి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేపట్టాలని చేయని ప్రయత్నం లేదు.. అయితే అధికారం సంగతి పక్కన పెడితే వీరిద్దరి మధ్య పొత్తు సడలిపోయేలా ఉంది.. తొలినాళ్లలో తప్ప వీరి మధ్య ఉన్న సయోధ్య ఇప్పుడు లేదనిపిస్తుంది.  దేవాల‌యాల‌పై దాడుల విష‌యంలో మాత్రం ఒక్క‌టిగా క‌దిలిన‌ట్లు క‌నిపించినా.. జ‌నాల్లోకి బ‌లంగా వెళ్ల‌లేదు. దీంతో పార్టీ శ్రేణులు గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నాయి.

చివ‌ర‌కు మూడు రాజ‌ధానుల వ్య‌వ‌హారంలో కూడా ఇద్ద‌రు నేత‌లూ వేర్వేరు ప్ర‌క‌ట‌న‌లు ఇస్తుండ‌డం మ‌రింత గంద‌ర‌గోళానికి గురి చేస్తోంది. దీంతో ఏదైనా స‌మ‌స్య‌కు సంబంధించి విడివిడిగా స్పందించాలా..? ఒక‌రికొక‌రు క‌ల‌వ‌లా..? అనే సందేహం వారిని వెంటాడుతోంది. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో కూడా రెండు పార్టీల నిర్ణ‌యాలు వేర్వేరుగా క‌నిపిస్తున్నాయి. మూడు రాజ‌ధానుల అంశం రాష్ట్ర ప్ర‌భుత్వం ఇష్ట‌మ‌ని బీజేపీ చెబితే... జ‌న‌సేన మాత్రం ఏపీకి ఏకైక రాజ‌ధాని ఉండాల‌ని ప్ర‌క‌ట‌న‌లు ఇస్తోంది. బీజేపీ-జనసేన ఉమ్మడి పోరాటంతో ప్రజల్లోకి వెళ్తాయి అని చెప్పిన నేత‌లు ఇలా వేర్వేరుగా స్పందిస్తుండ‌డం చ‌ర్చ‌ల‌కు తావిస్తోంది. సోష‌ల్ మీడియాలో కూడా ఈ విష‌యంలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో వీటికి క్వారిటీ ఇవ్వాల్సిన బాధ్య‌త ఆ నేత‌ల‌దే

మరింత సమాచారం తెలుసుకోండి: