తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం అనేది కాస్త హాట్ హాట్ గా నడుస్తుంది. ప్రధానంగా టిఆర్ఎస్, బిజెపి  మధ్య ఈ పోరాటం అనేది ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేకపోయినా రాజకీయంగా మాత్రమే ఎన్నికలు వస్తే హాట్ టాపిక్ గా మారి ఉత్కంటను రేపుతున్నాయి. తాము గెలుస్తామని టిఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంటే బీజేపీ కూడా మేమే గెలుస్తామని చెబుతోంది. అటు కాంగ్రెస్ కూడా కాస్త గట్టిగానే పోరాటం చేస్తున్న సంగతి స్పష్టంగా అర్థమవుతుంది.

అయితే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రధానంగా హరీష్ రావు నియోజకవర్గం లో ఎక్కువగా తిరుగుతున్నారు. హరీష్ రావు ని ఎదుర్కొని దీటుగా రాజకీయం చేయడానికి బిజెపి నేతలు కూడా వెనకడుగు వేస్తున్నారు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా చూస్తే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. బీజేపీకి అసలు అంత సీన్ కూడా లేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక బీజేపీ నేతలు మాత్రం ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా సిద్ధమయ్యారని అంటున్నారు. ఖచ్చితంగా ప్రజలు తమకు మద్దతు ఇస్తున్నారు అని చెపుతున్నారు. అయితే ఇప్పుడు ప్రచారం చేసే విషయంలో మాత్రం బీజేపీ నేతలు బాగా ఇబ్బంది పడుతున్నారు. స్థానిక కార్యకర్తల నుంచి బిజెపి కి ఎలాంటి మద్దతు రావటం లేదు. కార్యకర్తలు ఎవరు కూడా పెద్దగా ప్రచారం లోకి పాల్గొనడానికి కూడా ముందుకు రాకపోవడం బీజేపీని బాగా ఇబ్బంది పెడుతుంది. బండి సంజయ్ లేకపోతే ధర్మపురి అరవింద్ వచ్చినప్పుడు మాత్రమే కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. గాని కనీసం అభ్యర్ధి వచ్చినప్పుడు కార్యకర్తలు రావడానికి పెద్దగా ఆసక్తి చూపించకపోవడం దారుణం.

మరింత సమాచారం తెలుసుకోండి: