ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అమరావతి అంశానికి సంబంధించి చాలా చర్చలు జరుగుతున్నాయి. రాజధాని అంశానికి సంబంధించి సీఎం జగన్ వేసే అడుగుల పై కూడా ఇప్పుడు చాలామంది అనేక వార్తలు సృష్టిస్తున్నారు. సీఎం జగన్ అమరావతి ప్రాంతానికి భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉందని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. అది ఎంత వరకు నిజమో తెలియదు కానీ సీఎం జగన్ మాత్రమే అమరావతి విషయంలో మాత్రం చాలా కీలకంగా వ్యవహరించే అవకాశాలు కనబడుతున్నాయి.

అసలు ఆయన ఏం చేస్తున్నారు ఏంటి అనే దానిపై రాజకీయవర్గాల్లో చాలా చర్చలు ఉన్నాయి. ప్రస్తుతం వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే అమరావతి విషయంలో సీఎం జగన్ కొన్ని వ్యూహాలను సిద్ధం చేసే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు. ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులకు సీఎం జగన్ పై కాస్త అభిప్రాయం మారింది. దీనితో అభిప్రాయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఆయన త్వరలోనే రైతులతో మాట్లాడే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలోనే సంక్రాంతి లోపు కొంత మంది రైతులను నేరుగా తన నివాసానికి పిలవాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అంతేకాకుండా రాజధాని గ్రామాల్లో తాను స్వయంగా పర్యటించి విధంగా కూడా సీఎం జగన్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అమరావతి ప్రాంత రైతుల ఎలా ఉంది...? వారేం కోరుకుంటున్నారో అనే దాన్ని నేరుగా సీఎం జగన్ తెలుసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. త్వరలోనే సీఎం జగన్ అమరావతి ప్రాంత పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా సీఎం జగన్ వేసే అవకాశాలు ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అమరావతి ప్రాంతంలో రైతుల మనోభావాలను తెలుసుకోవడానికి ఈ కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా అక్కడి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: