అతి త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అందరికన్నా భారతదేశం ఇంకా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే అమెరికాలో ఉన్నప్రజలలో ఇండియా నుండి వెళ్లి అక్కడ స్థిరపడినవారు ఎక్కువగా ఉండడం దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల జరిగిన ప్రచార కార్యక్రమాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కే మద్దతు పలకనున్నారని స్పష్టమైంది. ఇందుకు ప్రతిగా భారత్ అమెరికా నుండి ఏమి ఆశిస్తుంది అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిగా మారింది. ఇది తెలుసుకోవాలంటే కింద ఇచ్చిన ఏపీ హెరాల్డ్ ఆర్టికల్ ను చదవండి.

అయితే ప్రస్తుతం గత ఏప్రిల్, మే నెలలనుండి భారత్ మరియు చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంతో ఇరుదేశాల మధ్య చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది. దీనికొరకు ఇరుదేశాలు దాదాపు 50, 000  మంది సైనికులను కాపలాగా ఉంచారు. కొన్ని చోట్ల అయితే ఇరు దేశాల సైనికుల మధ్య దూరం 200 మీటర్ల కన్నా తక్కువగానే ఉంది. ఈ సైన్యాల క్రమశిక్షణలో అనాలోచితంగా ఒక చిన్న పొరపాటు జరిగినా.. అది భారీ సైనిక సంఘర్షణగా మారిపోవచ్చని భద్రతా నిపుణులు భయపడుతున్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో భారత్ కు అమెరికా సాయం చేస్తానంటూ అనేకసార్లు ముందుకొచ్చింది. అయితే భారత్ మాత్రం ఇంకా వారిని మిత్రపక్షంగా అంగీకరించలేదు.

భారత్ సరిహద్దు ప్రాంతాలను చైనా ఆక్రమించిందని చెబుతున్న ప్రాంతాలన్నింటినీ ఖాళీ చేసేలాగా అమెరికా ఒత్తిడి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే అమెరికా జపాన్ మరియు ఆస్ట్రేలియా లతో కలిసి క్వాడ్ అనే పేరుతో ఒక బృందంగా ఏర్పడ్డాయి. ఈ బృందం.. భద్రతా అంశాల గురించి చర్చించటానికి - ప్రధానంగా పెరుగుతున్న చైనా దూకుడుకు ఎలా ప్రతిస్పందించాలనే అంశం మీద చర్చించటానికి అక్టోబర్ ఆరంభంలో టోక్యోలో సమావేశమైంది.  ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ రానున్న అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ కి మద్దతు పలుకుతున్నారని విశ్లేషకుల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: