టీడీపీ నేత మాజీ మంత్రి లోకేష్ బాబు ఇప్పుడు అన్నిటిలోనూ చురుగ్గా ఉంటున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా రాజకీయాలను, ప్రజలను పట్టించుకోలేదు.. ఇప్పుడు మాత్రం వరుసగా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఊరూరా తిరుగుతున్నాడు.. అంతే కాదు ప్రతిపక్షంలో ఉంటే గానీ బాబు కు తెలియడం లేదు.. రాజకీయం విలువ. ఇప్పుడు వైసీపీ అధికారాన్ని తప్పు పడుతూనే ఉన్నాడు. అసలు విషయానికొస్తే వైసీపీ అధికారాన్ని మొదటి నుంచి తప్పు పడుతూనే ఉన్నాడు.ఇప్పటికీ కూడా అదే పని చేస్తున్నాడు.

ప్రజల సంక్షేమం కోసం అప్పులు తెచ్చి మరి వైసీపీ అధినేత ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే వాటిపై తన స్టయిల్లో కామెంట్లు చేస్తున్నాడు. రైతు భరోసా పథకం పై లోకేష్ నానా హంగామా చేసి అందులో చాలా తప్పులు ఉన్నాయంటూ ఎత్తిపొడిచాడు.. దీంతో వైకాపా నేతలకు టార్గెట్ అయ్యారు. ఇకపోతే మరో విషయమేంటంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసలు వైసీపీ ని తప్పు పడుతూ వ్యాఖ్యలు చేసినట్లు కనిపించలేదు..కానీ బాబు మాత్రం అయిందానికి, కానీ దానికి నోరు పారేసుకుంటూ, వైకాపా నేతలతో చివాట్లు తింటున్నారు.

ఇప్పుడు మాత్రం లోకేష్ ప్రజల దృష్టిలో పడటానికి కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు..జగన్ ఏదైతే చేసి ప్రజలకు దగ్గర అయ్యాడో ఇప్పుడు లోకేష్ కూడా అదే చేస్తున్నాడు.. అనడంలో ఆశ్చర్యం లేదు.. మంచి వ్యూహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు..ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ను భారీ వర్షాలు, వరదలు ముంచేసిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు లోకేష్ బాబు ఆంధ్ర ప్రదేశ్ లోకి పలు ప్రాంతాల్లో  పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. ముందుగా కృష్ణ , గుంటూరు  జిల్లాలో పర్యటించారు. తర్వాత గోదావరి జిల్లాలో పర్యటించారు.తాజాగా రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. వరద భాదితులకు టీడీపీ ,వైసీపీ ప్రభుత్వాలు ఎవరు నష్టపరిహారాన్ని ఇవ్వలేదు..లోకేష్ ముఖ్య ఉద్దేశ్యం టీడీపీ వారసత్వాన్ని మెల్లగా జనంలోకి తీసుకెళ్తున్నాడని తెలుస్తుంది. బాబు కూర్చుని చేస్తే.. ఆయన బాబు మాత్రమే ఇలా ప్రజలను ఆకర్షించడానికి ముందుకు వెళ్తున్నాడని తెలుస్తుంది. మరి లోకేష్ యాత్ర ఎంతవరకు టీడీపీ కి కలిసి వస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: