మహేష్ బాబు కేవలం తెరపైన మాత్రమే హీరో.. అదే మా జగన్ మాత్రం రియల్ హీరో. ఈ మాటలన్నది మరెవరో కాదు. స్వయంగా ఏపీ అధికార పార్టీకి సంబంధించిన మంత్రి పేర్ని నాని అన్నారు. అసలు వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఏపీ సర్కారు ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించే వారిపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలో భారీ ఫైన్లకు సంబంధించి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో, ఈ అంశంపై మంత్రి పేర్ని నానిమీడియా సమావేశంలో స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు బాగానే అర్ధం చేసుకుంటున్నారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం దీన్ని జీర్ణించుకోలేక పోతున్నాయని విమర్శించారు. తాజాగా మోటార్ వెహికల్ యాక్ట్ లో కేంద్ర ప్రభుత్వం 31 సవరణలు చేసిందని, వీటిలో 20 సెక్షన్లను అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందేనని ఈ సందర్భంగా గుర్తు చేసారు.

ఇక మిగిలిన 11 సెక్షన్లలో మాత్రమే వివిధ రాష్ట్రాలకు వెసులుబాటును కల్పించిందని అన్నారు. కేవలం కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ఏపీ ముఖ్య మంత్రి జగన్ భారీ జరిమానాల నిర్ణయం తీసుకున్నారని పేర్ని నాని ఈ సందర్భంగా జగన్ కు వత్తాసు పలికారు. ఇక ఇష్ట మొచ్చినట్టు వాహనాలను నడిపే వారిపై చర్యలు తీసుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. అలాగే రోడ్లపై గోతుల సంగతి ఏంటని అడిగే ప్రశ్నకు స్పందిస్తూ.. కింది విధంగా మాట్లాడారు.

భారీ వర్షాల వలెనే రోడ్లు దెబ్బతిన్నాయని, అయితే ఇలా రోడ్లపై గుంతలు పడితే ఎవరి ఇష్ట మొచ్చినట్టు వారు వాహనాలు నడపొచ్చా? అని అర్ధం లేని ప్రశ్న అడిగారు. మహేశ్ బాబు చిత్రం 'భరత్ అనే నేను' సినిమాలో భారీ జరిమానాలు విధిస్తే అందరూ మెచ్చుకున్నారని, అదే పని మా జగన్ చేస్తే తప్పంటారా? అని ఈ సందర్భంగా మండిపడ్డారు. మహేష్ బాబు కేవలం తెరపైనే హీరో.. మా జగన్ రియల్ హీరో అని సమర్ధించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: