భారత రాజధాని ఢిల్లీలో 13 ఏళ్ల మైనర్ బాలిక కనిపించకుండా పోయింది. 28 ఏళ్ల వివాహితుడు 13 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను తనతోపాటు తీసుకెళ్లాడు. పోలీసులు చెప్పిన ప్రకారం ఆ వివాహితుడు స్థానికంగా కూరగాయలు అమ్ముతాడు అని తెలుస్తోంది. 13 ఏళ్ల బాలిక ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో గాలిస్తున్నారు.


పూర్తి వివరాలు తెలుసుకుంటే ఢిల్లీలోని మెహ్రౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 18 న ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో దిల్దార్ అనే ఓ 28 పెళ్లి అయిన వ్యక్తి తనను తాను రాహుల్ ఠాకూర్ గా ఓ అమ్మాయి కుటుంబ సభ్యులతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. ఆ తర్వాత తరచూ వారి ఇంటికి వెళుతూ మంచి వాడిలాగా నటించే వాళ్ళని బాగా నమ్మించాడు. అలాగే 13 ఏళ్ల అమ్మాయితో ప్రతిరోజు మాట్లాడుతూ బాగా సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా తీసుకొని తరచూ ఫోన్ చేసేవాడు.


లాక్ డౌన్ సమయంలో దిల్దార్ కూరగాయలు, కొన్నిసార్లు పండ్లను అమ్మేందుకు మెహ్రౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో తిరిగేవాడని స్థానికులు చెబుతున్నారు. అయితే పోలీసులు చెప్పిన ప్రకారం అతడు తన పేరును రాహుల్ ఠాకూర్ గా మార్చుకున్నాడు.


బాలికను ఎత్తుకుపోయాడు అన్న ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేశారు. వారి విచారణలో దిల్దార్ అలియాస్ రాహుల్ యూపీలోని బడాన్ లో నిర్వహిస్తున్నట్టు తేలింది.  దిల్దార్ అలియాస్ రాహుల్‌కు సోని అనే ఓ దివ్యాంగురాలు అయిన భార్య సోనీ ఉందని పోలీసులు తెలుసుకున్నారు. అయితే భార్య సోనీ గర్భం ధరించిందని.. సెప్టెంబర్ 12న ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని... దాంతో ఆమెను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో దిల్దార్ జాయిన్ చేశాడని. అతడు తన భార్య ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే ముందు, ఓ 13 సంవత్సరాల మైనర్ తో జంప్ అయ్యాడు. ప్రస్తుతం ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి పదమూడేళ్ల బాలిక, దిల్దార్ కోసం వెతుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: