అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ సంచలన వార్తలు బయట పడుతున్నాయి. ఇంకా కేవలం వారం అంటే వారం రోజుల్లోనే ఈ ఎన్నికలు జరగనుండగా, ఈరోజు కోర్టు రికార్డులు షాకింగ్‌ న్యూస్‌ని బయలు పరిచాయి. ఈ క్రమంలో 19 ఏళ్ల యువకుడు ఒకరు డెమొక్రాటిక్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థి అయినటువంటి జో బైడెన్‌ని హత్య చేయాలని భావించినట్లు సమాచారం. ఈ నేపఫథ్యంలో సదరు వ్యక్తి బైడెన్‌ ఇంటి చుట్టూ తిరగడమే కాక ఆయుధాలు కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా అతగాడు పేలుడు పదార్థాలు, చైల్డ్‌ పోర్నోగ్రఫీ నేరం కింద కూడా అరెస్ట్‌ అవ్వడం గమనార్హం. ఈ క్రమంలో పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయట పడ్డాయి. ఇక అసలు విషయంలోకి వెళితే ఈ ఏడాది మే 28వ తేదీన, నార్త్ కరోలినాలోని పోలీసులు, బ్యాంకింగ్ పార్కింగ్ ప్లేస్‌ నుంచి మిస్సయిన వ్యాన్‌ను 19 ఏళ్ల అలెగ్జాండర్‌ హిల్లెల్‌ ట్రెయిస్‌మన్ తీసుకెళ్లడం గమనించారు. దాని అద్దాల్లోంచి ఏఆర్‌-15 స్టైల్ రైఫిల్, 380-క్యాలిబర్ హ్యాండ్‌గన్, ఒక పెట్టె గమనించారు.

దాంతో వారు వ్యాన్‌ని అడ్డుకున్నారు. తరువాత దాన్ని పూర్తిగా సర్చ్‌ చేయడంతో దానిలో 509,000 డాలర్ల డబ్బు, పుస్తకాలు (ఇస్లాంకు సంబంధించినవి), ఆయుధాలు,  స్వస్తికా డ్రాయింగ్స్‌, భవనాల్లో కూలిపోతున్న విమానాలకు సంబంధించిన ఫోటోలు, 9 మిమీ లుగర్, సిగ్ సావర్ ఏఆర్‌ రైఫిల్, ఒక కెల్-టెక్ సబ్ -2000, 22-క్యాలిబర్ రైఫిల్ మొదలైన వంటి వాటిని గుర్తించారు.

విచారణలో భాగంగా అతడు విస్తుపోయే విషయాలు వెల్లడించాడు. ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు అతడు జో బైడెన్‌ ఇంటి అడ్రెస్‌, రైఫిల్‌ పార్ట్స్‌, స్టేట్‌ గన్‌ చట్టాలు, నైట్‌ విజన్‌ గాగుల్స్‌ గురించి గూగుల్ చేశానన్నాడు. అలాగే మే నెలలో డెలావేర్‌లో వున్న బైడెన్‌ ఇంటికి నాలుగు మైళ్ల దూరంలో సంచరించినట్లు పేర్కొన్నాడు. కాగా రికార్డులు ఈ విషయాలు నిజమని నిర్థారించాయి. వీటితో పాటు ఈ ఏడాది ఏప్రిల్‌ 15న ఐ ఫన్నీ అనే ప్లాట్‌ఫామ్‌లో నేను జో బైడెన్‌ని చంపుతానా? అనే మిమ్‌ని కూడా షేర్‌ చేసినట్టు తెలుస్తోంది. కాగా ఈ విషయమై కొందరు ప్రత్యర్ధులు ఇతగాన్ని ట్రంప్ మనిషే అని చమత్కరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: