కరోనా భూతం ఆకలి తీరలేదు. ప్రపంచ దేశాల ప్రజలను ఇంకా పట్టి పీడిస్తోంది. గత 7 నెలలుగా కరోనా శాశ్వత నివారణ కొరకు వివిధ దేశాలు టీకా కనిపెట్టే పనిలో బిజీగా వున్నారు. అయితే కొవిడ్ ‌- 19ను ఎదుర్కొనే టీకా ఇంకా రాకపోవడం గమనార్హం. రష్యా ప్రకటించినప్పటికీ అది పూర్తి స్థాయి ఆప్షన్ కాదు. ఈ క్రమంలో దీని చికిత్స కోసం పరిశోధకులు కొన్ని రకాల డ్రగ్స్‌ను పరీక్షిస్తున్నారు. హెచ్‌ఐవీ, మలేరియా లాంటి ఇతర ఇన్ఫెక్షన్లకు వాడే మందులను వారు పరిశీలించారు. ఈ క్రమంలో రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ చికిత్సలో విరివిగా వాడే టోసిలిజుమాబ్‌ను టెస్ట్‌ చేసిన పరిశోధకులు అది కొవిడ్‌ను తగ్గించేందుకు ఎంత మాత్రం పనికి రాదని తేల్చి చెప్పారు. ఇక కరోనా చికిత్సలో భాగంగా టోసిలిజుమాబ్‌ మంచి టీకాగా పనిచేస్తుందని మొదట పరిశోధకులు భావించినా, ఇపుడు మాత్రం అది పనికి రాదని నిర్ధారణ చేసారు.

వీరి అనేక విధాలుగా పరీక్ష జరిపిన తరువాతే ఈ నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. మొదట అది ఇంటర్ ‌లూకిన్ 6 అనే ప్రోటీన్ చర్యను అడ్డుకుంటుందని భావించారు. తద్వారా ఇది రోగనిరోధక వ్యవస్థ ప్రతి స్పందనకు దోహదం చేస్తుందని అనుకున్నారు. ఈ క్రమంలో, అది కొవిడ్‌ మరణాల సంఖ్యను తగ్గిస్తుందని భావించారు. ఈ క్రమంలో దీనిపై 4 క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించారు.

అందులో భాగంగానే అది మరణాల సంఖ్యను ఎంత మాత్రం తగ్గించడం లేదని తేల్చారు. ఈ వివరాలను  పరిశోధకులు అక్టోబర్ 21న న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించగా ఈ విషయం తేటతెల్లం అయింది. ఈ సందర్భంగా వారు కరొనను లైట్ తీసుకోవద్దని ప్రపంచ ప్రజలకు మనవి చేసారు. యధావిధిగా మాస్కు పెట్టుకోవాలని సూచించారు. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అని సూచించారు. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలను  పరిశోధకులు అక్టోబర్ 21న న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: