తెలంగాణలో ఉప ఎన్నికల సమరం హోరెత్తుతోంది .దుబ్బాక ఉప ఎన్నిక సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయపార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎవరికి వారు మాదంటే మాది అంటూ తొడలు కొడుతూ మీసాలు తిప్పు తూ విజయం మాదంటే మాది అంటూ ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ టిఆర్ఎస్ తరుపున రాష్ట్ర మంత్రి హరీష్ రావు గ్రామగ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షించడంలో తనదైన ముద్ర ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం దుబ్బాక మండలం రాజక్కపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత తరుపున హరీష్ రావు ప్రచారం చేశారు. హరీష్ రావు వచ్చిన సందర్భంగా భారీ ఎత్తున జనం తో రోడ్డంతా నిండిపోయింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీజేపీ గోబెల్స్‌ ప్రచారం చేస్తుందని తనదైన శైలిలో విమర్శల ఘాటు పెంచారు . బీజేపీ నేతలు ఉద్యోగాలపై మాట్లాడుతున్నారని.. మోదీ అధికారంలోకి వస్తే ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారని, ఇప్పటి వరకు ఎంత మందికి జాబ్‌లు ఇచ్చారో చెప్పాలని హరీష్ రావు వ్యంగ్య స్రాలు సంధించారు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కార్ తెలంగాణలో లక్షా 24వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ఓటేస్తే కాలిపోయే మోటార్లు.. బీజేపీకి ఓటేస్తే బాయి కాడా మోటార్లే అంటూ తనదైన శైలిలో ఘాటు విమర్శలు చేశారు ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు మంత్రి హరీష్. హరీష్ రావు మాటలతో టిఆర్ఎస్ నాయకులు కొత్త ఉత్సాహం వస్తుందని చెప్పుకోవచ్చు. రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నా దుబ్బాక ఉప ఎన్నికల సమరంలో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి. టిఆర్ఎస్ నాయకులు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా తనదైన శైలిలో ప్రచార పర్వం కొనసాగిస్తున్నారు. మరి ప్రతిపక్షాలు తమ ప్రచారంలో వేగం ఎంత మేరకు చూపిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: