కాశ్మీర్ అంశం లో ఎన్నో ఏళ్ల నుంచి భారత్ పాకిస్తాన్ మధ్య వివాదం కొనసాగుతూ నే వస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశం గురించి ఎన్నో సార్లు పాకిస్తాన్ భారత దేశాల మధ్య యుద్ధ వాతావరణం పరిస్థితులు నెలకొన్నాయి సరిహద్దుల్లో. ముఖ్యం గా కాశ్మీర్ ప్రాంతంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో కి రాక ముందు ఉన్న 370 ఆర్టికల్ రద్దు చేయడంతో  పాకిస్థాన్ మరింత రగిలిపోయింది అన్న విషయం తెలిసిందే. 370 ఆర్టికల్ రద్దు చేయడంతో విషయాన్ని ఏకంగా ఐక్యరాజ్యసమితి దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు పాకిస్తాన్ ప్రయత్నించినప్పటికీ అక్కడ విఫలమైంది.



 అంతే కాకుండా పాకిస్తాన్ కాశ్మీర్ వ్యవహారాన్ని ఎప్పుడు ఐక్యరాజ్యసమితి ముందు లేదా ద్వైపాక్షిక సదస్సులలో కూడా పాకిస్తాన్  ఎప్పుడూ మాట్లాడుతూ ఏదో ఒక విధంగా భారత్ పై  ఆరోపణలు చేస్తూనే ఉంటుంది అనే విషయం తెలిసిందే. పాకిస్తాన్ భారత్ పై కాశ్మీర్ విషయంలో ఆరోపణలు చేసిన సమయంలో భారత విదేశాంగ మంత్రులు పాకిస్తాన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉండేవారు. కానీ ప్రస్తుతం బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దౌత్య పరంగా ఎంతో దూకుడుగా ముందుకు సాగుతుంది భారత్. ఈ క్రమంలోనే కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు ఊహించని షాక్ ఇచ్చింది.



 ఇటీవలే కామన్వెల్త్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తి భారత్ పై  ఆరోపణలు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో వెంటనే స్పందించిన భారత్ పాకిస్తాన్ ఆరోపణలకు వ్యూహాత్మకంగా చెక్ పెట్టింది. మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ అనే రేంజ్ లోనే సమాధానం ఇచ్చింది భారత్. కాశ్మీర్ అంశం మరోసారి కామన్వెల్త్ సంఘ బేటీ లో రావడానికి వీలు లేదని .. ఎందుకంటే కాశ్మీర్ అంశం ద్వైపాక్షికం అంటూ భారత్ సమాధానమిచ్చింది. అంతేకాకుండా ద్వైపాక్షిక చర్చలను  కూడా భారత్ నిరాకరిస్తుంది అంటూ గట్టిగా  బదులిచ్చింది భారత్.

మరింత సమాచారం తెలుసుకోండి: