పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్  అన్న   విషయం తెలిసిందే. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి మత రాజ్య స్థాపన లక్ష్యంగా ఎన్నో దేశాల్లో విధ్వంసాలు సృష్టిస్తూ ఉంటుంది. ఎంతో నీచమైన వ్యూహాలతో ఇప్పటికే పలు దేశాలలో విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ముఖ్యంగా పాకిస్తాన్ టార్గెట్ భారత్ అనే విషయం తెలిసిందే. భారత్ లో  దారుణాలు  సృష్టించడానికి ఎంతవరకైన తెగిస్తూ  ఉంటుంది పాకిస్తాన్. ముఖ్యంగా సరిహద్దుల నుంచి ఎప్పటికప్పుడు ఉగ్రవాదులు పంపిస్తూ  భారత్ లో మారణహోమం సృష్టించడానికి ఎన్నో ఎత్తులు వేస్తూ ఉంటుంది.



 ఈ క్రమంలోనే భారత్ ఐక్యరాజ్య సమితి ముందు పాకిస్తాన్ ఒక ఉగ్ర దేశం  అని నమ్మించడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించి పాకిస్తాన్ను చివరికి ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన ఎఫ్ ఏ టి ఎఫ్ లో గ్రే లిస్ట్ లోకి వచ్చేలా చేసింది, ఇక ఇటీవలే మరోసారి పాకిస్తాన్ దురాగతాలు అన్నింటిని ఏపీటీఎఫ్ ముందుకు తీసుకెళ్లి ఏకంగా పాకిస్తాన్ ను  బ్లాక్ లిస్టులో చేర్చేందుకు భారత్ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించింది.



 అయితే పాకిస్తాన్ ను ఎఫ్ఏటీఎఫ్ ముందు దోషిగా నిలబెట్టి బ్లాక్లిస్టులో చేర్చాలి  అనే భారతదేశ వ్యూహం  ఫలించలేదు అని చెప్పాలి. ఎందుకంటే బ్లాక్ లిస్టులో చేర్చకుండా ఉండేందుకు పాకిస్థాన్ కి మూడు దేశాలు మద్దతు ప్రకటించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే.. టర్కీ  మలేషియా చైనా దేశాలు పాకిస్తాన్ కి మద్దతు ప్రకటించడంతో చివరికి బ్లాక్లిస్టులో కి వెళ్ళకుండా గ్రే లిస్టులో కొనసాగేందుకు అవకాశం దక్కించుకుని విజయం సాధించింది పాకిస్థాన్.దీంతో పాకిస్తాన్ ని బ్లాక్ లిస్టులో పడేలా చేయాలనే భారత వ్యూహం  టర్కీ మలేషియా చైనా దేశాలు మద్దతు తెలపడంతో సాధ్యం కాలేదు. కానీ పాకిస్తాన్ కు  సౌదీ అరేబియా మద్దతు తెలుపకపోవటంతో   సౌదీ పాకిస్తాన్ ను  వ్యతిరేకిస్తుంది అన్న విషయం మాత్రం బయట పడింది

మరింత సమాచారం తెలుసుకోండి: