ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. మరోసారి నిమ్మగడ్డ రమేష్ పై విరుచుకుపడ్డారు వైసిపి నాయకులు. ఏపీలో కరోనా సమయంలో స్ధానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌పై వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు ఒక్కొక్కరుగా ఎదురుదాడి మొదలుపెడుతున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వానికి స్ధానిక ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదంటూ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పష్టం చేయగా.. ఇవాళ మరో మంత్రి కొడాలి నాని కూడా నిమ్మగడ్డ ప్రయత్నాలపై విరుచుకుపడ్డారు. రమేష్ ఏమైనా దేవుడా.. ఆయన చెప్పిందే వేదమా, మాకు ప్రజలే ముఖ్యమని తేల్చిచెప్పారు. బీహార్‌లో ఎన్నికలు నిర్వహిస్తున్నందున ఏపీలోనూ జరగాలని కోరుకోవడం సరికాదన్నారు. ఏపీలో కరోనా విజృంభన కొనసాగుతున్న ఈ సమయంలో లో ఎన్నికలు నిర్వహించడం ఏంటి అని కొడాలి నాని ప్రశ్నించారు. అయితే కరోనా వచ్చిన మొదట్లో కరుణ ప్రమాదంలో గుర్తించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు స్థానిక ఎలక్షన్ లను వాయిదా వేశారు అయితే అప్పుడు ఇది పెను సంచలనం అయింది వెంటనే జగన్ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషన్ నుండి తొలగించి అప్పటికప్పుడు తమిళనాడు నుంచి మాజీ న్యాయమూర్తిని ఎలక్షన్ కమిషనర్ గా నియమించింది జగన్ ప్రభుత్వం అయితే దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో తన వాదనను వినిపించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. అయితే ప్రస్తుతంఏపీలో కరోనా ప్రభావం కొనసాగుతున్నప్పటికీ స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ చేస్తున్న ప్రయత్నాలపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అసహనం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ రమేష్‌ చేసే ఈ ప్రయత్నాలు కరోనా వేళ స్ధానిక ఎన్నికల నిర్వహణ సరైన చర్య కాదన్నారు. స్ధానిక ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ నిర్ణయం ఎలా ఉన్నా తమ ప్రభుత్వానికి మాత్రం ప్రజల శ్రేయస్సే ముఖ్యమని కొడాలి నాని వ్యాఖ్యానించారు. కొడాలి నాని చెప్పిన ఈ మాటల వల్ల స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే అని అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: