డబ్బు సంపాదించాలంటే.. కేవలం చదువులు చదివి ఉద్యోగాలు చేస్తేనే కాదు.. మనసుకు నచ్చిన పని చేస్తూ కూడా బాగానే సంపాదించొచ్చు.. ఇప్పుడు ఆరోగ్యకరమైన పంటలే అరుదైపోయాయి. అన్నీ మందులతో పండే పంటలే. అలాంటి సమయంలో మందులు వేయకుండా పంటలు పండిస్తే.. అవి సరిగ్గా మార్కెటింగ్ చేసుకున్నా మంచి ఆదాయమే సంపాదించుకోవచ్చు. డిగ్రీ చదివి బీఈడీ చేసి ఓ ప్రైవేటు స్కూల్లో పని చేసే ఓ ఉపాధ్యాయుడు.. అది మానేసి ఆకు కూరల సాగు చేసుకుంటూ అంత కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఉదంతం ఇప్పుడు చూద్దాం.

ఇలాంటి ఓ వ్యక్తి గురించి రూరల్ మీడియా పరిచయం చేస్తోంది.. చదవండి..
కరీంనగర్ నుండి 50కిలో మీటర్లు వెళ్తే ఆహ్లాదమైన సుందర గిరి చేరుకోవచ్చు. ఊరు పక్కనే ఎత్తయిన కొండ .దానిపక్కనే వరి, జొన్నలు ,ఆకుకూరల పంటల మధ్య రైతులు.. కోసిన టమాటా, బెండకాయ లను కంటైనర్లలో సర్దుతున్న కూలీలు..మధురమైన పుల్లని టమాటాలు రుచి చూస్తూ వారితో ముచ్చటించడం నిజంగా అరుదైన సందర్భం.

కాకర తీగను మృధువుగా పందిరి మీదకు ఎక్కిస్తూ ..
‘‘ నా స్టోరీ మీరు విని తీరాలన్నా …’’ అన్నాడు రాధాకిష్న. మా టీం ట్రైపాడ్‌ని అతని ముందు సెట్ చేశారు.. మాసిన చొక్కా,పెరిగిన గడ్డం తో చూడడానికి అతి మామూలుగా కనిపించాడు కానీ, అతను మాట్లాడుతుంటే మాతో పాటు, పక్కనే ఉన్న జొన్న కంకులు వంగి సలాం చేశాయి. సింగిల్ టేక్‌లో తీసిన అరుదైన సక్సెస్..

‘‘ చాలీచాలని జీతంతో టీచర్‌గా కొలువు చేసేటోడిని..  అలా కాదని.
ఉద్యోగం మానేసి, మా పొలంలో ప్రకృతి వ్యవ సాయం మొదలు పెట్టాను. ఒక రోజు అనుకోని అద్భుతం జరిగింది…’’ అన్నాడు… అదేంటో అతని మాటల్లోనే  ఈ వీడియో ద్వారా విందామా..!? వింటే మీరే ఆశ్చరపోతారు..


మరింత సమాచారం తెలుసుకోండి: