బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మొదటి దశ ఎన్నికలకు మరి కొద్ది రోజులు ఉండటంతో పార్టీలన్నీ మేనిఫెస్టోలో విడుదల చేయడంలో బిజీ అయిపోయాయి. ఇటీవలే బిజెపి పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన ఆర్జెడి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో ప్రధానమైన అంశాలు గా నిరుద్యోగులకు నెలకు రూ.1500 భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లాలూ కుమారుడు, ఆర్జేడీకి నాయకత్వం వహిస్తున్న తేజస్వి యాదవ్ ప్రకటించారు. అలాగే రైతులకు రుణమాఫీ కూడా హామీ ఇచ్చింది . ఆర్జేడీ మేనిఫెస్టో ప్రకటన సందర్భంగా తేజస్వి యాదవ్ మాట్లాడుతూ  ప్రజల నమ్మకానికి ,విశ్వాసానికి ఒక ప్రతీకగా మేనిఫెస్టోను రూపకల్పన చేశామ ని ఇందులో మోసపూరిత హామీలు ఏవి లేకుండా, ప్రధానంగా మేము చేసే చెప్పమని, దీన్ని ఒక భగవద్గీత నమ్మి విడుదల చేస్తున్నామని అన్నారు.


బీహార్‌లో అధికార బీజేపీ - జేడీయూ కూటమి మీద తేజస్వి యాదవ్ విరుచుకుపడ్డారు. ఒకవేళ తాము కూడా బీజేపీ, డబుల్ ఇంజిన్ గవర్న‌మెంట్ తరహాలో తప్పుడు హామీలు ఇవ్వాలనుకుంటే 50 లక్షలు లేకపోతే కోటి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించేవారిమని తేజస్వి యాదవ్ అన్నారు. ‘ఉపాధి చూపించడానికి, ఉద్యోగం చూపించడానికి మధ్య చాలా తేడా ఉంది. చెత్త కాగితాలు ఏరుకునే వాడికి కూడా ఉపాధి ఉన్నట్టే. కానీ, మేం 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతున్నాం. మొదటి కేబినెట్ సమావేశంలోనే దీనిపై సంతకం పెడతాం.


 హెల్త్ కేర్ సెక్టార్‌లో, ఎడ్యుకేషన్ సెక్టార్, మొదలైన వాటిలో 4.5 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. 7 శాతం జూనియర్ ఇంజినీర్ల పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి.’ అని తేజస్వి యాదవ్ అన్నారు. ఇదివరకే బీజేపీ మేనిఫెస్టో లో తప్పుడు హామీలతో తమ స్వార్థపూరిత రాజకీయాల కోసం బీహార్ ప్రజలు వాడుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే మన బిహారల్ తో చాలా ఆడుకున్నారు ఇక ఆటలు సాగనివ్వకుండా ఓట్లతో తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర ప్రజలకు మనవి చేసుకుంటున్నాను అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: