బాలీవుడ్ లో జరిగిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యను విచారంచే దిశలో జరిగిన అనేక పరిణామాలు మనము చూసాము. ఈ విషయం అక్కడనుండి డ్రగ్స్ కేసు వరకు వెళ్ళింది. ఈ డ్రగ్స్ కుంభకోణంలో అనేకమంది సినిమా స్టార్స్ మరియు రాజకీయనాయకులు కుమ్మక్కై ఉన్నారు. రోజు రోజుకీ దుర్గ్స్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. అయితే తాజాగా మరో మాజీ మంత్రి కుమారుడి ఇంట్లో డ్రగ్స్ దొరకడం సంచలనంగా మారింది.  

ఈ నేపథ్యంలో కేసును దర్యాప్తు చేస్తున్న బెంగళూరు కేంద్ర క్రైమ్ బ్రాంచ్ అధికారులు అన్ని అంశాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో ప్రధానంగా కొంత మంది ప్రముఖులు అలాగే వారి బంధువులు పేర్లు కూడా ఉన్నాయి. ఇక పోతే ఈ జాబితాలో ఆదిత్య అల్వా కూడా నిందితులుగా ఉన్నారు. ఆదిత్య అల్వా మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ సోదరుడు. శాండల్ వుడ్ డ్రగ్ కేసులో కాటన్పేట్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేసిన ఎఫ్ ఐఆర్ లో ఆదిత్య 6వ నిందితుడిగా ఉన్నారు. ఆదిత్య అల్వా నివాసంలో ఎన్ సీబీ అధికారులు దాడులు చేయగా 55 గ్రాముల పొడి గంజాయి లభించింది.

లాక్ డౌన్ సమయంలో ఆల్వా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను డ్రగ్ పెడ్లర్లతో సన్నిహితంగా ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. పార్టీలో డ్రగ్స్ సేకరించి సరఫరా చేయడంలో ఆదిత్య అల్వా ప్రధాన పాత్ర పోషించాడని ఇప్పటికే ఎన్ సీబీ విచారిస్తున్న నిందితుడు రవిశంకర్ అంగీకరించాడు. ఆదిత్య అల్వా పేరు వెలుగులోకి రావడంతో సెప్టెంబర్ 4 నుంచి పరారీలో ఉన్నాడు. అతనిపై ఎఫ్ ఐఆర్ నమోదు అవడంపై ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇక ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన వారిలో సినీ నటులు రాగిణి ద్వివేది సంజన గల్రానీ పార్టీ ఆర్గనైజర్ వీరెన్ ఖన్నా రియల్టర్ రాహుల్ ఆర్టీఓ గుమస్తా బి.కె.రవిశంకర్ ఉన్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: