గత కొంతకాలంగా వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలోనే ఉంటూ కొంతమంది నేతలు పార్టీకి చేటు చేసే విధంగా వ్యవహరిస్తూ, పార్టీకి చేటు తెచ్చే విధంగా వ్యవహరిస్తుండటం పై ఆయన సీరియస్ గానే దృష్టి పెట్టారు. ముఖ్యంగా పార్టీ సంబంధించి అత్యంత రహస్యమైన విషయాలను సైతం బయటకు లీక్ చేస్తూ, పార్టీకి చేటు చేస్తున్న  వారి లిస్ట్ జగన్ కు అందడంతో, ఇప్పుడు వారిపై సీరియస్ గా యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. గత కొంతకాలంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అత్యంత కీలకమైన విషయాలు బయటకు వెళ్ళి పోతున్నాయి. ముఖ్యంగా టీడీపీ అనుకూల మీడియా కు ఈ విషయాలు క్షణాల్లో చేరిపోతున్నట్లు, దానిపై వారు కథనాలు మీద కథనాలు ప్రచారం చేయడం, ప్రభుత్వం ను అభాసుపాలు చేయడం వంటివి నిత్యకృత్యంగా మారింది. 



మొదట్లో ఈ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోకపోయినా, ఆ తరువాత దీన్ని సీరియస్ గానే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంపీలకు సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చినా, మార్పు కనిపించకపోగా, యథాతథంగానే లీకులు బయటకు వెళ్ళి పోతున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ తో జగన్ భేటీ అయి చర్చించిన విషయాలు సైతం టీడీపీ అనుకూల మీడియా లో ప్రచారం చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అసలు ఈ వివరాలు బయటకు ఎలా వెళ్లాయి అనే విషయాలపై ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా జగన్ విచారణ చేయించగా, చాలామంది నేతల పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.



 ఆ వివరాలను వారు జగన్ కు అందించడంతో, ఇప్పుడు సదరు నేతల్లో టెన్షన్ పెరిగిపోయిందట. ఇంటిలిజెన్స్ అందించిన నివేదికలో పార్టీకి చెందిన కీలక నేతలు ఉన్నారట. నెల్లూరు , సీమ జిల్లాలకు చెందిన వారే కాకుండా, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు సైతం ఉండడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అలాగే ఈ లిస్టులో ఒక మంత్రి సైతం ఉండడంతో, జగన్ వీరందరి పైన ఏ చర్యలు తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. ఏది ఏమైనా జగన్ కు లీకు వీరుల లిస్ట్ చేరిపోవడం తో వైసీపీలో ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: