ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యం లో తెలుగు రాష్ట్రాల మొత్తం అతలాకుతలం విడిపోయిన విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా పూర్తిగా తెలుగు రాష్ట్రాలు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లడం తో పాటు  ఎంతగానో ఆస్తి నష్టం కూడా జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ వర్షం పేరెత్తితే చాలు బెంబేలెత్తిపోయే  పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమం లోనే ఇటీవలే వాతావరణ శాఖ అధికారుల కు ఏపీ తెలంగాణ రాష్ట్రాల కు వర్షపు ముప్పు తప్పిందని ఇటీవలే తెలపడం తో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఊపిరి పీల్చుకున్న  విషయం తెలిసిందే. కానీ మరోసారి ఏపీని వర్షం ముంచెత్తేందుకు  సిద్ధమైనట్లు తెలుస్తోంది.



 మరోసారి ఏపీ లోని పలు జిల్లాలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఇటీవల వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రానున్న నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. నైరుతి బంగాళాఖాతం లో 1.5-3.1 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 4 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.


శనివారం ఉభయ గోదావరి, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో మళ్లీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. అయితే రానున్న 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నాయని ఇటీవలే వాతావరణ శాఖ అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. ఈశాన్య రుతుపవనాలు ఈనెల 28వ తేదీన దేశంలోకి ప్రవేశించనున్నాయని తెలిపారు. ఈశాన్య రుతుపవనాల వర్షాలు కోస్తా ఆంధ్ర తమిళనాడు పుదుచ్చేరి లతోపాటు కర్ణాటక కేరళ సరిహద్దు ప్రాంతాల్లో కూడా కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ఇటీవలే బులెటిన్ కూడా విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: