ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం కరోనా  వైరస్ అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి వైరస్ వెలుగులోకి వచ్చి దాదాపు ఏడు నెలల గడిచి  పోతున్నప్పటికీ ఈ వైరస్ ను అంతం చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి రాని నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంది ఈ మహమ్మారి ప్రాణాంతకమైన కరోనా వైరస్. ఇక కొన్ని దేశాల్లో అయితే పరిస్థితి రోజురోజుకు చేయి దాటి పోయే పరిస్థితులు కూడా ఏర్పడుతున్న  విషయం తెలిసిందే, అయితే కరోనా వైరస్ ను నియంత్రించేందుకు అన్ని దేశాలు ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ కరోనా వైరస్ కేసుల సంఖ్య మాత్రం తగ్గిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే కరోనా వైరస్ ను కంట్రోల్ చేసేందుకు మొదట లాక్ డౌన్ విధించి  కఠిన నిబంధనలు విధించిన ఆయా దేశాలు ప్రస్తుతం కరోనా వైరస్ తో సహజీవనం తప్పదు అని భావించి అన్లాక్ కొనసాగిస్తూ అన్ని రకాల కార్యకలాపాలు మొదలు పెడుతున్న విషయం తెలిసింది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది. అయితే కరోనా వైరస్ ప్రభావం విషయంలో ఎప్పటికప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తూ కీలక సూచనలు సలహాలు ఇస్తూనే ఉన్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి కరోనా వైరస్ ప్రభావం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.



 కరోనా వైరస్ ప్రభావంలో  మనం ఇంకా అక్టోబర్లోనే ఉన్నామని ఫిబ్రవరి నాటికి పరిస్థితులు మరింత దిగజారిపోయే అవకాశం ఉంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్  ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ ను ఎదుర్కునే నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచ దేశాలు మొత్తం కీలక దశలోనే ఉన్నాయి అంటూ తెలిపిన ఆయన... ఇక రాబోయే నెలల్లో పలు దేశాలలో పరిస్థితులు మరింత కఠినతరం గా మారే అవకాశం ఉంది అంటూ తెలిపారు. ప్రాణాంతకమైన కరోనా మహమ్మారి వ్యాధి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటూ వ్యాఖ్యానించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్.

మరింత సమాచారం తెలుసుకోండి: